/rtv/media/media_files/2025/06/23/atrocities-in-odisha-2025-06-23-08-03-24.jpg)
Atrocities in Odisha
Odisha : మనుషుల్లో రాక్షసత్వం రోజురోజుకు పెరిగిపోతుంది. తోటి మనుషులను మనుషులుగా చూడాలనే కనీస జ్ఞానం లేకుండపోతుంది. దానికి కులం, మతం తోడు కావడం మానవత్వాన్ని మరింత దిగజార్చుతోంది. ఆవులను అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు దళితులను ఘోరంగా హింసించడమే కాకుండా వారికి అరగుండు కొట్టించి మురుగునీరు తాగించి అమానుషంగా ప్రవర్తించిన తీరు ఒడిశాలో మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది.
Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?
Atrocities In Odisha
వివరాల ప్రకారం...ఒడిశాలోని గంజాం జిల్లా ధారాకోట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన ఇద్దరు దళితులు పక్కనే ఉన్న హరిపూర్‌కు వెళ్లారు. అక్కడ ఒక వ్యక్తి వద్ద ఓ ఆవు, రెండు దూడలను కొనుగోలు చేశారు. వాటిని నడిపించుకుంటూ తమ గ్రామానికి బయలు దేరారు. ఈ క్రమంలో ఖారిగుమ్మ అనే గ్రామం గుండా వెళుతుండగా కొంతమంది వారిని అడ్డుకున్నారు. అంతేకాకుండా ఆవుదూడలను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ తీవ్రంగా కొట్టారు. వారి వద్ద ఉన్న నగదు తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే బాధితులు తిరగబడటంతో మరింత రెచ్చిపోయి తీవ్రంగా హింసించారు.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
అంతటితో ఆగకుండా వారికి అరగుండ్లు కొట్టించారు. ఖారిగుమ్మ గ్రామం నుంచి సుమారు రెండు కి.మీ దూరంలో ఉన్న మరో గ్రామానికి తీసుకెళ్లి అక్కడ మురుగునీరు తాగించారు. వారిని మోకాళ్లపై నడిపించి ఇబ్బంది పెట్టారు. అయితే బాధితులు వారినుంచి తప్పించుకుని సొంత గ్రామానికి చేరుకున్నారు. తమ గ్రామస్తుల సహాకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాధితులకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎనిమిదిమందిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
Also Read : యుద్ధంలోకి నార్త్ కొరియా.. ఇరాన్‌కు నేనున్నానంటూ కిమ్
crime incident | crime news | odisha-news | odisha-police
Follow Us