Assam: అస్సాం బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి

అస్సాం ర్యాట్ హోల్‌లో బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికుల్లో ముగ్గురు మృతి చెందారు. గనిలో చిక్కుకున్న వారిలో ముగ్గురు కార్మికులు మరణించారు. అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
assam rat hole

assam rat hole Photograph: (assam rat hole)

అస్సాంలోని ర్యాట్ హోల్ బొగ్గు గనిలో అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ బొగ్గు గనిలోకి అకస్మాత్తుగా నీళ్లు రావడంతో 18 మంది కార్మికులు చిక్కుకున్నారు. దిమాహసావ్ జిల్లాకి 3 కి.మీ దూరంలో ఉన్న బొగ్గు గనిలో చిక్కుకున్న వారిలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. అక్రమంగా తవ్వకాలు జరిపిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గనిలో చిక్కుకున్న వారిని రక్షించడానికి విశాఖపట్నం తూర్పు నౌకాదళానికి చెందిన గజ ఈతగాళ్లను అధికారులు తీసుకొచ్చారు. 

ఇది కూడా చూడండి: Makara Sankranti: సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా..దాని వెనుక ఉన్న కథేంటంటే!

ఇది కూడా చూడండి: అస్సాం బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి

గనిలోకి చిక్కుక్కుపోవడంతో..

డిమా హసావో జిల్లాలోని మారుమూల పారిశ్రామిక పట్టణమైన ఉమ్రాంగ్సోలో ర్యాట్ హోల్ బొగ్గు గని ఉంది. ఈ గనిలోకి నీరు ప్రవేశించడంతో దాదాపు 18 మంది కార్మికులు చిక్కుకుపోయారు. 300 అడుగుల లోతైన ఈ అక్రమ క్వారీలో దాదాపు 100 అడుగుల మేర నీరు చేరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రెండు మోటార్‌ పంపుల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు. 

ఇది కూడా చూడండి:  ప్లీజ్.. ఆ వీడియోను తొలిగించండి :  కోర్టు మెట్లెక్కిన రమ్య

Advertisment
తాజా కథనాలు