/rtv/media/media_files/2026/02/08/assam-cm-2026-02-08-15-23-46.jpg)
లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగొయ్(MP Gaurav Gogoi) పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ(himantha-biswa-sharma) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గొగొయ్‌కు పాకిస్థానీ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని ఆయన ఆరోపించారు. ఆదివారం గువాహటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ సంచలన విషయాలను వెల్లడించారు. అలీ తౌఖీర్ షేక్ అనే పాకిస్థానీ ఏజెంట్ 2010-13 మధ్య 13 సార్లు భారత్‌కు వచ్చారని, ఆయనతో గొగొయ్ దంపతులకు సంబంధాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు.
Also Read : కూలిన మూడంతస్తుల భవనం.. స్పాట్‌లో 20 మంది..
Assam CM Makes Against Gaurav Gogoi
VIDEO | Guwahati: "Gaurav Gogoi and his wife are close with accused number 1 Ali Tauqeer Sheikh, a foreign-based planner and handler," says Assam CM Himanta Biswa Sarma.
— Press Trust of India (@PTI_News) February 8, 2026
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/YfHKUyN9Ib
Also Read : అనిల్ అంబానికి స్వీడన్ మహిళను ఆఫర్ చేసిన ఎప్‌స్టీన్.. వెలుగులోకి సంచలన నిజాలు
గౌరవ్ గొగొయ్ భార్య ఎలిజబెత్ (బ్రిటన్ పౌరురాలు) గతంలో పాకిస్థానీ సంస్థలో పనిచేశారని, ఆమె జీతాన్ని అలీనే చెల్లించేవారని ఆరోపించారు. ఆమె భారత్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించి అలీకి నివేదికలు ఇచ్చేవారని, ఇందులో FCRA నిబంధనల ఉల్లంఘన జరిగిందని తెలిపారు. 2013లో గౌరవ్ గొగొయ్ 10 రోజుల పాటు రహస్యంగా పాకిస్థాన్(pakisthan) పర్యటించారని, అక్కడ ఆయనకు ఏదో ఒక రకమైన ట్రైనింగ్ ఇచ్చి ఉండవచ్చని హిమంత అనుమానం వ్యక్తం చేశారు. ఆ పర్యటన తర్వాతే ఆయన పార్లమెంటులో అణు విద్యుత్, రక్షణ రంగాలపై ప్రశ్నలు అడిగారని గుర్తుచేశారు. ఈ అంశం జాతీయ భద్రతతో ముడిపడి ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కేంద్ర దర్యాప్తునకు సిఫార్సు చేస్తోందని సీఎం వెల్లడించారు.
ముఖ్యమంత్రి ఆరోపణలను గౌరవ్ గొగొయ్ 'సూపర్ ఫ్లాప్'గా కొట్టిపారేశారు. అస్సాం సీఎం తనపై చేస్తున్నవన్నీ నిరాధారమైన, అర్థం లేని ఆరోపణలేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కుటుంబంపై తాము చేస్తున్న భూ ఆక్రమణల ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని X వేదికగా విమర్శించారు.
Follow Us