అనిల్‌ అంబానికి స్వీడన్ మహిళను ఆఫర్ చేసిన ఎప్‌స్టీన్‌.. వెలుగులోకి సంచలన నిజాలు

అమెరికన్ ఫైనాన్సర్‌ జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు కూడా తెరపైకి వచ్చింది.

New Update
Epstein Files expose alleged links between Epstein and Anil Ambani

Epstein Files expose alleged links between Epstein and Anil Ambani

అమెరికన్ ఫైనాన్సర్‌ జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అక్కడికి వెళ్లిన శ్రీమంతులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు కూడా తెరపైకి వచ్చింది. జెఫ్రీ ఎప్‌స్టీన్, అనిల్ అంబానీ మధ్య 2017 నుంచి 2019 వరకు కొనసాగించిన సంభాషణలు, సందేశాలు బయటపడ్డాయి. ఎప్‌స్టీన్‌పై లైంగిక నేరాల అభియోగాలు రావడానికి కొన్ని నెలల ముందు వరకు ఇవి కొనసాగినట్లు సమాచారం. 

స్వీడిష్ మహిళకు అనిల్ అంబానీ ఆఫర్ చేసిన అంశం, ప్యారిస్ నగరంలో మీటింగ్, 2018లో దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదికపై ట్రంప్‌ వ్యాఖ్యలకు స్పందించడం, 2019లో న్యూయార్క్‌కు వస్తే ఎప్‌స్టీన్‌ ఇంటి వద్ద కలవాలని నిర్ణయించడం లాంటి విషయాలు బయటపడ్డాయి. అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి తీసిన సినిమాలకు హీరోయిన్లను సెలెక్ట్ చేసే అంశాలు కూడా ఎప్‌స్టీన్‌తో చర్చించినట్లు డాక్యుమెంట్స్‌లో తేలాయి. అంతేకాదు ధీరుబాయ్‌ అంబానీపై వచ్చిన పుస్తకాలను కూడా ఎప్‌స్టీన్ ప్రత్యేకంగా తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.  

Also Read: రష్యాలో దారుణం.. దుండుగుడు కత్తితో దాడి.. నలుగురు భారతీయ విద్యార్థులకు తీవ్ర గాయాలు

అనిల్‌ అంబానీకి చెందిన రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా తీసిన సినిమాలకు హీరోయిన్ల ఎంపిక అంశాలు కూడా ఎప్‌స్టీన్‌తో చర్చించినట్లు ఆయా దస్త్రాలు వెల్లడించాయి. వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన ధీరూభాయ్‌ అంబానీపై వెలువడిన పుస్తకాలను ఎప్‌స్టీన్‌ ప్రత్యేకంగా తెప్పించుకున్నట్లు తెలిసింది.

మరోవైపు ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ప్రధాని మోదీ పేరు కూడా ప్రస్తావన వచ్చింది. ఎప్‌స్టీన్ రాసినట్లు భావిస్తున్న కొన్ని ఈమెయిల్స్‌లో ప్రధాని మోదీ పేరు కనిపించింది. 2017లో మోదీ ఇజ్రాయెల్‌కు వచ్చిన విషయాన్ని ఎప్‌స్టీన్‌ ఓ ఈమెయిల్‌లో రాసుకొచ్చాడు. ప్రధాని మోదీ తన సలహా మేరకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయోజనాల కోసం ఆ పర్యటన చేశారని చెప్పినట్లు సమాచారం. 2014 నుంచి 2019 వరకు భారత ప్రభుత్వంలో పలువురు కీలక వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకునేందుకు, అలాగే రిపబ్లికన్ స్ట్రాటజిస్ట్ స్టీవ్ బానన్‌తో మోదీకి మీటింగ్ ఏర్పాటు చేసేందుకు ఎప్‌స్టీన్ యత్నించినట్లు డాక్యుమెంట్‌లో వెల్లడయ్యాయి. 

Also Read: అమెరికాపై గెలిచిన ఇండియా.. దిగివచ్చిన ట్రంప్

ఇదిలాఉండగా ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను అమెరికన్ చట్టసభ సభ్యుల సమీక్షకు కూడా అక్కడి న్యాయశాఖ పర్మిషన్ ఇచ్చింది. చట్టసభల సభ్యులకు పూర్తి దస్త్రాలను ఎలక్ట్రానిక్స్‌ రూపంలో దీన్ని అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. న్యాయశాఖ కంప్యూటర్లపై వాటిని మాత్రమే చూడాల్సి ఉంటుంది. డాక్యుమెంట్‌ కాపీలు చేతికి ఇవ్వమని న్యాయశాఖ వెల్లడించింది.