/rtv/media/media_files/2025/02/03/QYj3anpCvYPHKAMC0PYx.jpg)
MD Acharya Balakrishna Photograph: (MD Acharya Balakrishna)
యోగా గురువు రామ్‌దేవ్ బాబాకు కోర్టు షాక్ ఇచ్చింది. పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు బాబా రామ్‌దేవ్ (Baba Ramdev), ఎండీ ఆచార్య బాలకృష్ణలపై కేరళలోని పాలక్కాడ్ జిల్లా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో వీరు విచారణకు హాజరుకాకపోవడంతో పాలక్కాడ్ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఇద్దరిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు.
Also Read : ISRO శ్రీహరి కోట నుంచి చేసిన 100వ ప్రయోగానికి అవరోధం
Also Read : ఆ విషయంలో శోభిత ఎక్కువగా ఫీల్ అయ్యింది: నాగ చైతన్య
Arrest Warrant To Ramdev Baba
పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ (Patanjali Ayurved Ltd) అనుబంధ సంస్థ అయిన దివ్య ఫార్మసీ కేళర యాడ్స్ రూల్స్ బ్రేక్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేశారు. దీనిపై ఫిబ్రవరి 01న కోర్టు ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా బాబా రామ్‌దేవ్, బాలకృష్ణలను న్యాయస్థానం ఆదేశించింది. వీరు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి ఇద్దరిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 15న జరగనుంది. దివ్య ఫార్మాసిటీని మొదటి నిందితుడిగా, ఆచార్య బాలకృష్ణ రెండో నిందితుడిగా, బాబా రామ్‌దేవ్‌ను మూడో నిందితుడిగా పేర్కొన్నారు.
Read aslo ;Kolkata: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ విద్యార్ధిని ఆత్మహత్య
గతంలో కూడా అల్లోపతి వంటి ఆధునిక ఔషధాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రచారం చేసినందుకుగానూ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అటువంటి ప్రకటనలు మానుకోవాలని హెచ్చరించింది. అవేమి పట్టించుకోని పతంజలి సంస్థ.. తిరిగి ప్రకటనలు ప్రచురించడంతో కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. ఈ వ్యవహారం సీరియస్ కావడంతో రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలు బహిరంగ క్షమాపణలు చెప్పారు.
Also Read : నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!