ISRO శ్రీహరి కోట నుంచి చేసిన 100వ ప్రయోగానికి అవరోధం

ఇస్రో శ్రీహరికోట నుంచి చేసిన 100 ప్రయోగంలో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. GSLV-F15 వెహికల్ జనవరి 29న NVS-02 ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. లిక్విడ్ ఇంజన్ స్టార్ట్ అవ్వనందున శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ ఆలస్యం అవుతుందని ఇస్రో తెలిపింది.

New Update
GSLV-F15

GSLV-F15 Photograph: (GSLV-F15 )

ISRO: ఇస్రో ఈ ఏడాది పంపిన మొదటి ప్రయోగానికే అవరోధం ఏర్పడింది. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లాంచ్ చేసిన 100వ రాకెట్ జనవరి 29న విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. GSLV-F15 వెహికల్ యూఆర్ రావు శాటిలైల్ సెంటర్ తయారు చేసిన NVS-02 ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. ఇది ఒక నావిగేషన్ శాటిలైట్. ఈ శాటిలైట్‌లో ఆదివారం టెక్నికల్ ఇష్యూ తలెత్తింది.

లిక్విడ్ ఇంజన్ సరిగా పని చేయనందున ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టలేకపోయారు. ఆక్సిజన్‌ను మండించే నాజిల్స్ తెరుచుకోనందున NVS-02ని ప్రవేశపెట్టాలనుకున్న కక్ష్యలోకి పంపే ప్రక్రియ ఆలస్యం కావచ్చు ఇస్రో తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇస్రో చైర్మన్‌గా వి.నారాయణన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన మొదటి ప్రయోగం ఇదే. అంతేకాదు ఇప్పటి వరకు షార్ నుంచి ప్రయోగించిన 100వ రాకెట్ లాంచ్ కూడా ఇదే.

Read also: Elon Musk: మా సిబ్బంది వారానికి 120 గంటలు పని చేస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

NVS-02 బరువు 2,250 కేజీలు. దీన్ని భూమికి 170 భూమి నుంచి 36, 577 కిలో మీటర్ల దూరంలో 170 కిలో మీటర్ల పొడవైన కక్ష్యలో ప్రవేశపెట్టడం కష్టమని అంతరిక్ష నిపుణులు చెబుతున్నారు. జీపీఎస్ సిస్టమ్ నావిగేషన్ కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దీన్ని డిజైన్ చేసింది. లిక్విడ్ ఇంజన్ స్టార్ట్ కానందున NVS-02ని అనుకున్న కక్ష్యలోకి ప్రవేశపెట్టలేక పోతున్నారు శాస్త్రవేత్తలు.

Also Read: ఆ బాలీవుడ్ నటుడికి ఫిదా అయిన కుంభమేళా బ్యూటీ మోనాలిసా.. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే?

Advertisment
తాజా కథనాలు