Sonu Sood : సోనూ సూద్‌కు బిగ్ షాక్.. పంజాబ్ కోర్టు అరెస్ట్ వారెంట్
బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కు బిగ్ షాక్ తగిలింది. మోసం కేసులో ఆయనకు పంజాబ్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సోనూ సూద్ ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది.