/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/gun-jpg.webp)
బిహార్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే బంగారు ఆభరణాల షోరూంలోకి చొరబడి దోపిడీకి తెగబడ్డారు. సిబ్బందికి తుపాకి గురిపెట్టిన కొందరు దుండగులు నగలు ఎత్తుకెళ్లారు. దాదాపు రూ.25 కోట్ల విలువైన ఆభరణాలను దోచుకుపోయారు. ఈ చోరీ దృశ్యాలు అక్కడి సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Also Read: Boat Accident: పడవ బోల్తా పడి 25 మంది మృతి..వారిలో ఫుట్‌బాల్ ఆటగాళ్లు కూడా!
బిహార్‌లోని భోజ్‌పుర్ జిల్లా అర్రా పట్టణం గోపాల్ చౌక్ ప్రాంతంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు టాటా గ్రూప్‌కి చెందిన తనిష్క్ షోరూమ్‌లో భారీ దోపిడీ చోటుచేసుకుంది. దుకాణం తెరిచిన 5 నిమిషాలకే ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు షాపులోనికి దూసుకొచ్చి.. సెక్యూరిటీ సిబ్బందిని బంధించారు. అనంతరం సిబ్బంది, కస్టమర్లను తుపాకీతో బెదిరించి.. తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో ఆభరణాలు సర్దుకుని పరారయ్యారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ దోపిడీ జరగడం గమనార్హం.
Also Read: Rains: మండుతున్న ఎండల్లో వాతావరణశాఖ చల్లటి వార్త.. 3 రోజులపాటు వానలే..వానలు!
దోపిడీ తీరును సెక్యూరిటీ గార్డు మనోజ్ కుమార్ వివరిస్తూ.. సోమవారం ఉదయం 10 గంటలకు షోరూమ్ తెరిచామని చెప్పారు. ‘కారులో వచ్చిన ఆరుగురు క్రిమినల్స్ వాహనాన్ని వీధికి అడ్డంగా నిలిపారు.. మా షోరూమ్ పాలసీ ప్రకారం నలుగురి కంటే ఎక్కువ మందిని ఒకేసారి లోపలికి అనుమతించం.. అందుకే ఇద్దరు ఇద్దర్ని అనుమతిస్తాం.. చివరిగా వచ్చిన ఆరో వ్యక్తి నా తలపై తుపాకి గురిపెట్టి.. కొట్టి చేతిలోని ఆయుధం లాక్కున్నాడు.. అనంతరం షో కేసుల్లోని ఆభరణాలను దోపిడీ చేసి బ్యాగుల్లో సర్దుకుని పారిపోయారు..’ అని చెప్పాడు. ఆ సమయంలో వారిని ఎదురిస్తే తమ ప్రాణాలు తీస్తారేమోనని భయపడిపోయామని సిబ్బంది తెలిపారు.
VIDEO | Armed robbers stormed a Tanishq showroom in Bihar's Arrah this morning and looted jewellery worth crores. The robbery took place at the Gopali Chowk branch in the Arrah police station area and the incident was caught in the CCTV installed inside the showroom.
— Press Trust of India (@PTI_News) March 10, 2025
(Video… pic.twitter.com/sU44vmpWwo
ఈ ఘటనతో అప్రమత్తమైన భోజ్‌పూర్ జిల్లా ఎస్పీ.. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. నేరస్థులను గుర్తించడంలో సహాయపడటానికి CCTV ఫుటేజ్, ఫోటోలను జిల్లా వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. దీంతో పోలీసు బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అర్రాలోని బాబూరా చోటి వంతెన వద్ద మూడు బైక్‌లపై ఆరుగురు అనుమానాస్పద వ్యక్తులు డోరిగంజ్ వైపు వేగంగా వెళుతున్నట్లు గుర్తించారు. వాటిని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా వేగంగా బైక్‌లతో దూసుకెళ్లారు. తమ వద్ద ఉన్న తుపాకీతో పోలీసులుపై కాల్పులు జరిపారు. వెంటనే పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు దుండగులు గాయపడ్డారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిందితుల నుంచి రెండు తుపాకులతో పాటు చోరీ చేసిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు తనిష్క్ సంస్థ పూర్తిగా సహకరిస్తోంది. ఇదిలా ఉండగా.. ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించలేదని షోరూమ్ సిబ్బంది ఆరోపించారు. తాము పోలీసులను సంప్రదించడానికి ప్రయత్నిస్తే, ఫోన్లను పట్టించుకోలేదని, ఈ ప్రాంతంలో సమర్థవంతమైన భద్రతా చర్యలు లేకపోవడం గురించి తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేశామని షోరూమ్ మేనేజర్ కుమార్ మృత్యుంజయ్ పేర్కొన్నారు.
Also Read: Elan Musk: ఎక్స్ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్ దాడే అంటున్న మస్క్!