Amit Shah: మోదీ తర్వాత అమిత్ షా రికార్డ్..ఆయనకు మాత్రమే సొంతం

బీజేపీ నేతలు రికార్డుల మోత మోగిస్తున్నారు.  ప్రధాని మోదీ అత్యంత ఎక్కువ కాలం పని చేసిన పీఎంకా రికార్డ్ సృష్టించారు. ఆయన తర్వాత అమిత్ షా కూడా దేశ చరిత్రలో అత్యధిక కాలం హోంమంత్రిగా పని చేసిన రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. 

New Update
Amit

Home Minister Amit Shah

వరుసగా మూడు పర్యాయాలు ఎన్డీయే దేశంలో ప్రభుత్వం నెలకొల్పింది. దీంతో ప్రధాని మోదీతో సహా బీజేపీ అగ్ర నేతలు రికార్డుల మోత మోగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ ఇందిరాగాంధీ తర్వాత అత్యంత ఎక్కవు కాలం ప్రధానిగా పని చేసిన రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు బీజేపీలో మరో కీలక నేత అమిత్ షా వంతు. ఈయన కూడా మోదీ తరహాలో అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేశారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం హోంమంత్రిగా పని చేసిన వ్యక్తిగా అమిత్ షా నిలిచారు. ఈయన ఇదే పార్టీకి చెందిన దివంగత నేత ఎల్ కే అద్వానీ రికార్డ్ ను బద్దలుకొట్టారు. అద్వానీతో పాటు కాంగ్రెస్‌కు చెందిన గోవింద్ వల్లభ్ పంత్ ఆరు సంవత్సరాలకు పైగా హోం మంత్రిగా విధులు నిర్వర్తించారు. మోడీ 1.0 పాలనలో హోం మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ ఐదు సంవత్సరాలు పని చేశారు. ఇప్పుడు అమిత్ షా వీరందరినీ దాటుకుని ఆరేళ్ల 64 రోజులు పదవిలో ఉన్నారు. ఇంకా కంటిన్యూ కూడా అవుతున్నారు. 

Also Read :  మందుల ధరలు తగ్గాయి: పేద, మధ్యతరగతికి కేంద్రం ఊరట

ఆరేళ్ళల్లో ఎన్నో కీలక నిర్ణయాలు..

ప్రధాని మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చాక అమిత్ షా కేంద్ర హోం మంత్రి అయ్యారు. అప్పుడు ఐదు ఏళ్ళు విధులు నిర్వర్తించారు.  ఇప్పుడు మూడవసారి అధికారంలోకి వచ్చాక కూడా అదే పదవిని కొనసాగిస్తున్నారు. హోం మంత్రిగా అమిత్ షా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్, లడఖ్ లను రెండు ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తున్నట్లు ప్రకటించారు. దీని తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, దేశంలో నక్సలిజం నిర్మూలన వంటి అనేకమైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

హోంమంత్రి కంటే ముందు అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా ఉంటూ చాలాసార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. అస్సాం, త్రిపురల్లో బీజేపీ గెలవడానికి..2017లో 15 ఏళ్ళ తర్వాత ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు వెనుక అమిత్ షా కృషి ఉంది. 

Also Read :  లవ్ మ్యారేజ్ చేసుకున్నారని.. గ్రామస్థులంతా కలిసి సంచలన నిర్ణయం!

amit shah | home-minister | today-latest-news-in-telugu | telugu-news | national news in Telugu

Advertisment
తాజా కథనాలు