Medication Price: మందుల ధరలు తగ్గాయి: పేద, మధ్యతరగతికి కేంద్రం ఊరట

కేంద్ర ప్రభుత్వం 35 ముఖ్యమైన మందుల ధరలను తగ్గించింది. డయాబెటిస్, క్యాన్సర్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు వాడే ఈ మందుల ధరలు 14 నుంచి గరిష్టంగా 53 శాతం వరకు తగ్గాయి. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
medicines Price

medicines Price

New Delhi: పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తూ.. కేంద్ర ప్రభుత్వం 35 ముఖ్యమైన మందుల ధరలను (medicines Price) తగ్గించింది. డయాబెటిస్, క్యాన్సర్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు వాడే ఈ మందుల ధరలు 14 నుంచి గరిష్టంగా 53 శాతం వరకు తగ్గాయి. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (National Pharmaceutical Pricing Authority - NPPA) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తగ్గింపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. సామాన్య ప్రజల ఆరోగ్య ఖర్చులను తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు వెల్లడించారు.  ఈ ధరల తగ్గింపు వల్ల ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థిక భారం తగ్గుతుంది. ఇప్పటికే జన ఔషధి కేంద్రాల ద్వారా రాయితీపై మందులను విక్రయిస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఖరీదైన మందులపై డబ్బులను ఆదా చేస్తున్నారు.

మందుల ధరలను తగ్గిస్తూ..

ప్రస్తుతం నిత్యం వాడే వివిధ మందులపై కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించడం వారికి మరింత మేలును చేకూరుస్తుందని సామాజికవేత్తలు అంటున్నారు. అంతేకాకుండా వివిధ వ్యాధులతో బాధపడేవారికి చికిత్సలో భాగంగా నాణ్యమైన ఔషధాలు అందుబాటులోకి వస్తాయని అభిప్రాపడుతున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు తెచ్చిన కేంద్ర ప్రభుత్వం తరచూ మందుల ధరలను తగ్గిస్తూ ప్రజలకు ఎంతో మేలు చేస్తోందంటున్నారు. అయితే ధరలు తగ్గిన మందుల జాబితాలో కీలకమైన మందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్‌తో పాటు ఇన్ఫెక్షన్ల చికిత్సలో వాడే గ్లిక్లాజైడ్, మెట్‌ఫార్మిన్, టెల్మిసార్టన్, రామిప్రిల్, అజిత్రోమైసిన్, సెఫిక్సిమ్ వంటి యాంటీబయాటిక్స్ ఉన్నాయి. వీటితోపాటు అలర్జీలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులకు ఉపయోగించే మందుల ధరలు కూడా తగ్గాయి. 

ఇది కూడా చదవండి: ఏం చేయాలో మాకు తెలుసు..అమెరికాకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన భారత్

ఏసిక్లోఫెనాక్-పారాసెటమాల్-ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ టాబ్లెట్ ధరను రూ.13గా, క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ అదే ఫార్ములేషన్ ధరను రూ.15.01గా కిత్త ధరలు నిర్ణయించింది. గుండెకు సంబంధించిన వ్యాధులకు విస్తృతంగా వాడే అటోర్వాస్టాటిన్ 40 ఎంజీ + క్లోపీడొగ్రెల్ 75 ఎంజీ మాత్రల ధరను రూ.25.61గా ఖరారు చేశారు. చిన్నపిల్లలకు ఉపయోగించే సెఫిక్సిమ్, పారాసెటమాల్ ఓరల్ సస్పెన్షన్స్, విటమిన్ డి లోపానికి వాడే కోలికాల్సిఫెరాల్ డ్రాప్స్, డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ ధర కూడా తగ్గించబడింది. ఔషధాల తయారీ కంపెనీలు కొత్త ధరల జాబితాను ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IPDMS)లో అప్‌డేట్ చేయాలని, NPPA, రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రోగులకు సరసమైన ధరల్లో మందులు లభించడంతోపాటు, వైద్య ఖర్చుల భారం కొంతవరకు తగ్గుతుందని భావిస్తున్నారు. రిటైలర్లు, డీలర్లు తమ దుకాణాలలో కొత్త ధరల జాబితాను స్పష్టంగా ప్రదర్శించాలని NPPA ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించని వారిపై డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (DPCO), 2013, నిత్యావసర వస్తువుల చట్టం, 1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: మోదీ తర్వాత అమిత్ షా రికార్డ్..ఆయనకు మాత్రమే సొంతం

Advertisment
తాజా కథనాలు