Monika Kapoor Case: 26 ఏళ్ళుగా పరారీ.. ఎట్టకేలకు  సీబీఐ కస్టడీకి ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్‌

26 ఏళ్ళుగా పరారీలో ఉన్న ఆర్ధిక నేరస్థురాలు మోనికా కపూర్ ను ఎట్టకేలకు భారత్ తీసుకువస్తున్నారు. యూఎస్ అధికారులు ఆమెను సీబీఐ కస్టడీకి అప్పగించారు. ఈరోజు రాత్రి ఆమెను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు.

New Update
monika

Monika Kapoor Case

Monika Kapoor Case: ఎప్పుడో 1999లో తన సోదరులతో కలిపి మనీ లాండరింగ్(Money Laundering) నేరాలు చేసింది మోనికా కపూర్. ఓ ఆభరణాల వ్యాపారం విషయంలో తన సోదరులతో కలిసి నకిలీ పత్రాలను తయారుచేసింది. ఆ తర్వాత వ్యాపారం చేయడానికి కావల్సిన సరుకులను టాక్స్ లేకుండా దిగుమతి చేసుకోవడానికి  ఆ పత్రాలను ఉపయోగించింది. దీని తర్వాత మోనికా కపూర్, పోదరులు యూఎస్ పారిపోయారు. ఈమె చేసిన మోసానికి భారత ప్రభుత్వానికి దాదాపు రూ.5కోట్ల నష్టం వచ్చింది. దీంతో మోనికా కపూర్ పై 2004లో కేసు నమోదైంది. 

Also Read: నితీశ్‌ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌

సీబీఐ అధికారులకు అప్పగింత..

అప్పటి నుంచి మోనికాను దర్యాప్తు రావాలని కోర్టు నోటీసులు పంపిస్తూనే ఉంది. కానీ ఆమె మాత్రం రాలేదు. దీంతో మోనికాను అప్పగించాలని 2010లో భారత ప్రభుత్వం అమెరికాను కోరింది. ఆమెపై ఇంటర్‌పోల్‌ అధికారులు రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అప్పుడూ ఆమెను అక్కడి నుంచి పంపడానికి ప్రయత్నించగా..ఇండియా తిరిగి వెళితే తనను అధికారులు హింసలకు గురి చేస్తారని..తిరిగి పంపొద్దంటూ మోనికా న్యూ యార్క్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇన్నాళ్ళూ కోర్టులో ఉన్న ఆ కేసును తాజాగా కోర్టు కొట్టివేయడంతో అమెరికాలోని అధికారులు సీబీఐ  కస్టడీకి అప్పగించారు. వీరు మోనికా కపూర్ ను  ఎయిర్‌లైన్స్ విమానంలో బుధవారం రాత్రికి ఆమెను అమెరికా నుంచి భారత్‌కు తీసుకురానున్నారు.  భారత్‌- అమెరికాల మధ్య ఉన్న ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం న్యూయార్క్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టు ఆమెను భారత్‌కు అప్పగించడానికి అనుమతి ఇచ్చింది. 

Also Read: యుగాంతం ఎఫెక్ట్‌.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు

Also Read: PM Modi: ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం

Advertisment
Advertisment
తాజా కథనాలు