HMPV వైరస్ కరోనా కంటే ప్రమాదకరమా?.. వైద్యులు ఏం చెబుతున్నారు?

HMPV వైరస్ వ్యాప్తి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే HMPV కరోనా లాంటిది కాదని.. మహమ్మారి అయ్యే అవకాశాలు లేవని వైద్య నిపుణులు అంటున్నారు. HMPV వైరస్ కొత్తదేమీ కాదని.. ఇది ఎన్నో ఏళ్లుగా చాలా దేశాల్లో ఉందని అపోలో ఆస్పత్రి వైద్యుడు సుధీర్ కుమార్ తెలిపారు.

New Update
HMPV virus india

HMPV virus india

HMPV:  HMPV వైరస్ కలకలం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో ఈ వైరస్ వ్యాప్తి మరో కరోనాను తలపిస్తోంది..లక్షల మంది వైరస్ వ్యాప్తితో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీని వ్యాప్తి చైనాతో ఆగలేదు ఒక దేశం నుంచి మరొక దేశానికి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే  జపాన్, వివిధ దేశాల్లో ఈ వైరస్ కేసులు నమోదయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు  భారతదేశానికి కూడా వచ్చేసింది. ఈరోజు ఇండియాలో తొలి HMPV కేసు నమోదైంది.  బెంగళూరులో 3 నెలల పాప, అలాగే 8 నెలల చిన్నారికి, అహ్మదాబాద్‌లో రెండు నెలల చిన్నారికి ఈ వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో  దేశవ్యాప్తంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా కంటే ఇది ప్రమాదకరంగా ఉండబోతుందా? మరోసారి దేశంలోకి  కరోనా లాంటి మహమ్మారి రాబోతోందా? అని ఆందోళన చెందుతున్నారు. 

HMPV  వైరస్ ప్రమాదకరమా?

ఈ క్రమంలో పలు వైద్య నిపుణులు HMPV వైరస్ తీవ్రత పై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. HMPV వైరస్ కొత్తదేమీ కాదని.. ఇది ఎన్నో ఏళ్లుగా చాలా దేశాల్లో ఉందని HYD అపోలో ఆస్పత్రి వైద్యుడు సుధీర్ కుమార్ తెలిపారు. HMPV కరోనా లాంటిది కాదని.. మహమ్మారి అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. 5 ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్నవారు, వృద్దులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి ఈ వైరస్ ఎక్కువగా సంక్రమిస్తుందని తెలిపారు. అయితే వైరస్ సోకినా 4-7 రోజుల్లో కోలుకుంటారని వివరించారు. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరు వైరస్ విషయంలో వ్యక్తిగత జాగ్రత్త పాటించడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read: సినీ ప్రియులకు అదిరిపోయే న్యూస్ .. గ్రాండ్ గా 10వ అజంతా-ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్!

Advertisment
తాజా కథనాలు