Al Qaeda: బెంగళూరులో అల్‌ఖైదా టెర్రర్‌ మాడ్యుల్‌ మాస్టర్‌ మైండ్‌ అరెస్టు

అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద మాడ్యూల్ వెనక కీలక కుట్రదారుగా భావిస్తున్న 30 ఏళ్ల షామా పర్వీన్‌ను కర్ణాటకలోని బెంగళూరులో అరెస్టు చేశారు. ఆల్ ఖైదా కు సంబంధించిన అన్ని వ్యవహరాలను షామా పర్వీన్ స్వయంగా చూసుకుంటున్నట్లు  పోలీసులు వెల్లడించారు.

New Update
Al-Qaeda terror module mastermind arrested in Bengaluru

Al-Qaeda terror module mastermind arrested in Bengaluru

పహల్గాం దాడి అనంతరం దేశంలో తీవ్రవాదులకు సహరిస్తున్న వారిని ఏరివేసే కార్యక్రమాన్ని  భారత సైన్యం తీవ్రతరం చేసింది. అందులో భాగంగా బెంగళూరులో అల్‌ఖైదా టెర్రర్‌ మాడ్యుల్‌ మాస్టర్‌ మైండ్‌ ను అరెస్టు చేశారు. ఈ మేరకు  అల్‌ఖైదా (AQIS) టెర్రర్‌ మాడ్యుల్‌ మాస్టర్‌మైండ్‌ను గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.  అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద మాడ్యూల్ వెనక కీలక కుట్రదారుగా భావిస్తున్న 30 ఏళ్ల షామా పర్వీన్‌ను కర్ణాటకలోని బెంగళూరులో అరెస్టు చేసినట్లు సైనికాధికారులు తెలిపారు. ఆల్ ఖైదా కు సంబంధించిన అన్ని వ్యవహరాలను షామా పర్వీన్ స్వయంగా చూసుకుంటున్నట్లు  పోలీసులు వెల్లడించారు.

 కాగా పహల్గాం దాడి అనంతరం దేశంలో ఉగ్రవాదులకు మద్దతిస్తున్నవారిని గుర్తించడానికి అధికారులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా షామా పర్వీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కర్ణాటక కు చెందిన షామా అక్కడి నుంచి ఆమె ఉగ్రవాదులకు సహాయ కార్యకలపాల నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్టు వెల్లడించారు.

ఇది కూడా చూడండి:  30 దేశాలపై రష్యా సునామీ విధ్వంసం.. సముద్రం పక్కనున్న భారత్ పరిస్థితి ఏంటి?

Al-Qaeda Terror Module Mastermind Arrested

దీనితో పాటు జులై 23న ఈ మాడ్యుల్‌ తో సంబంధమున్న నలుగురు ఉగ్రవాద అనుమానితులను ఇప్పటికే సైన్యం అదుపులోకి తీసుకుంది. వారిలో మహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీ, మహమ్మద్ ఫైక్‌ లు ఉన్నారు. వీరందరినీ  గుజరాత్‌, దిల్లీ, నోయిడాలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరంతా సోషల్‌ మీడియాలోని ఓ రహస్య, ఆటో డిలీటెడ్‌ యాప్‌ ను ఉపయోగించి తమ కార్యకలపాలను కొనసాగిస్తున్నారు. ఒకరినొకరు యాప్‌ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారని తెలిపారు. కాగా ఈ గ్రూపుకు సంబంధించిన సభ్యులు  దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నారని తెలిపారు.  కాగా వారందరికీ షామా పర్వీన్‌ నాయకత్వం వహిస్తున్నట్లు సైనికాధికారులు గుర్తించారు.  కాగాఈ గ్రూపులోని సభ్యులంతా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్ర దాడులు అమలుచేయడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు.

ఈ గ్రూపులోని సభ్యులంతా  అల్‌ఖైదా, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన స్లీపర్‌సెల్‌ విభాగంతో, విదేశాలలోని ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఈ ముఠా సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఉగ్ర సంస్థలతో  సంబంధం కలిగి ఉన్నారని విచారణలె వెల్లడైందని అధికారులు తెలాపారు.

ఈ ఉమఠా సభ్యులు ఉ సంబంధించిన సైనిక, సున్నితమైన కీలక సమాచారాన్ని ఈ గ్రూపు సభ్యులు ఉగ్ర ముఠాలకు చేరవేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. కాగా వీరిని ఈ గ్రూప్‌కు చెందిన ఇతర ఉగ్రవాద మద్దతుదారులు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేసే వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే కీలక ముఠా సభ్యులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

కాగా పహల్గాం ఉగ్రదాడిలో అనేక మంది అమాయకులను చంపిన తీవ్రవాదులకోసం నిర్వహించిన ఆపరేషన్లో  కీలక సూత్రదారిగా భావిస్తున్న ఒక ఉగ్రవాదిని సైన్యం అంతం చేసింది.  

ఇది కూడా చూడండి:పాకిస్థాన్‌కు అమెరికా షాక్.. UNSCలో భారత్ విజయం

india hits terrorist bases in pak | 2-terrorists-killed | anti-terror action | al qaeda | Pahalgam attack | latest-telugu-news | telugu-news | national news in Telugu

Advertisment
తాజా కథనాలు