Pakistan: పాకిస్తాన్ లో మళ్ళీ బాంబు పేలుడు..తొమ్మిది మంది మృతి

పక్క దేశం పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లింది. కైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌ లో గురువారం బాంబు పేలుళ్ళు జరిగాయి. ఇందులో తొమ్మిది మంది చనిపోగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

New Update
peshavar

Bomb Blast In Pesahvar, Pakistan

గత కొన్ని రోజులుగా పాకిసతాన్ అల్లకల్లోలంగా మారింది. ఒకవైపు పీవోకేలో నిరసనలు జరుగుతున్నాయి. అక్కడ పోలీసులు సామాన్య జనాల మీద ఫైరింగ్ లు చేస్తున్నారు. మరోవైపు కైబర్ పఖ్తుంఖ్వాలో పోలీసులే లక్ష్యంగా బాంబు దాడులు జరుగుతున్నాయి. తాజాగా పెషావర్ బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లింది. పోలీస్ అధికారులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయడ్డారు. ఈ దాడిని పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ మియాన్ సయీద్ కార్యాలయం ధృవీకరించింది. దీని తరువాత అక్కడ పెద్ద భద్రతా బలగాలను మోహరించారు. పేలుడికి కారణమైన పరికరాన్ని పోలీసులు తిరిగే మార్గంలో అమర్చారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 

అంతకు ముదు సెప్టెంబర్ 30న పాక్‌లోని  క్వెట్టా నగరంలో  భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. క్వెట్టాలోని ఝార్గూన్ రోడ్డుమార్గంలో ఈ పేలుడు జరిగింది.  పేలుడు అనంతరం కాల్పుల మోతలు వినిపించాయి. ఈ ఘటన తర్వాత నగరంలోని అన్ని ఆసుపత్రులలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రధాన రహదారి మీద జరిగిన ఈ బాంబు పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.  

పీవోకేలో 40 మంది..

మరోవైపు పీవోకేలో నిరసనకారులు పాకిస్తాన్ ఆర్మీ వెహికల్ ను తగులబెట్టేశారు. దీని తరువాత ఆర్మీ ప్రజలపై కాల్పులు జరిపింది. ఇందులో 40మంది దాకా సామాన్య జనం చనిపోయారని తెలుస్తోంది. 

Also Read: Stock Market: మళ్ళీ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 229 పాయింట్లు పతనం

Advertisment
తాజా కథనాలు