Crime: భార్యతో గొడవ.. కొడుకుని కొట్టి చంపిన తండ్రి

బిహార్‌ రాజధాని పాట్నాలో దారుణం జరిగింది. ఓ హోటల్‌ రూమ్‌లో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి కోపంలో తన ఆరేళ్ల కొడుకుని కొట్టి చంపడం కలకలం రేపింది.

New Update
Police

Police

బిహార్‌ రాజధాని పాట్నాలో దారుణం జరిగింది. ఓ హోటల్‌ రూమ్‌లో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి కోపంలో తన ఆరేళ్ల కొడుకుని కొట్టి చంపడం కలకలం రేపింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రభాకర్ మహతో అనే వ్యక్తి తన భార్య, ఆరేళ్ల కొడుకుతో కలిసి శనివారం పాట్నా చూసేందుకు అక్కడికి వచ్చారు. పాట్నా రైల్వేస్టేషన్‌ దగ్గర్లోని ఓ హోటల్‌లో వాళ్లు బస చేశారు.  

Also Read: నాగ్‌పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి 74 ఏళ్ల వ్యక్తి మృతి

శనివారం రాత్రి ఆ హోటల్‌ గదిలో భార్యభర్తలు గొడవపడ్డారు. దీంతో కోపంలో ప్రభాకర్.. తన ఆరేళ్ల కొడుకైన సన్నీని కూడా కొట్టాడు. నేలపైకి విసిరేశాడు. ఆ తర్వాత హోటల్ నుంచి పారిపోయాడు. అతడి భార్య సమాచారం మేరకు పోలీసులు ఆ హోటల్‌కు వచ్చారు. తీవ్రంగా గాయాలపాలైన ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు.   

Also Read: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!

కానీ ఆ బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. చివరికి భార్య ఫిర్యాదుతో భర్త ప్రభాకర్‌పై పోలీసులు కేసు పెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలాఉండగా.. ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య తలెత్తే గొడవలు హత్యలు చేసే పరిస్థితులకు దారి తీయడం కలకలం రేపుతోంది. 

Also Read: అమెరికా వెళ్లే భారతీయులకు బిగ్ షాక్.. US ఎంబసీ వార్నింగ్

Advertisment
తాజా కథనాలు