16 ఏళ్ల తర్వాత కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టులో న్యాయం.. 16 ఏళ్ల తర్వాత ఓ కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. ఆ కానిస్టేబుల్ కొడుకుకి ఆరు వారాల్లోగా ప్రభుత్వం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. By B Aravind 28 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 16 ఏళ్ల తర్వాత ఓ కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. ఆ కానిస్టేబుల్ కొడుకుకి ఆరు వారాల్లోగా ప్రభుత్వం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని అలీఘర్‌లో శిశుపాల్ సింగ్ అనే వ్యక్తి రాష్ట్ర పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ డ్రైవర్‌గా విధులు నిర్వహించేవాడు. అయితే ఆయన 1992లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ఆ తర్వాత అనారోగ్యానికి గురై 1995లో మృతి చెందాడు. ఆ సమయంలో శిశుపాల్ సింగ్ కొడుకు వీరేంద్ర పాల్ సింగ్ మైనర్. దీంతో అతని తల్లి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించలేకపోయింది. Also Read: ప్రధాని మోదీని చంపుతామంటూ.. ముంబాయి పోలీసులకు బెదిరింపు కాల్స్.. అయితే 13 ఏళ్ల తర్వాత వీరేంద్ర పాల్ మేజర్ అయ్యాడు. ఈ క్రమంలో 2008లో అతడు కారుణ్య నియామకం కోసం ప్రభుత్వానికి అప్లై చేసుకున్నాడు. ఇలా దరఖాస్తు చేసుకోవడంలో ఆలస్యం జరగడం వల్ల యూపీ సర్కార్ అతడి అప్లికేషన్‌ను తిరస్కరించింది. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వీరేంద్రపాల్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ అంశంపై మళ్లీ విచారణ జరపాలని హైకోర్టు సింగల్ బెంచ్ యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ అంశంపై పునరాలోచన చేసిన యూపీ ప్రభుత్వం ఆ తర్వాత దీన్ని తిరస్కరించింది. ఇది కూడా చదవండి: భారత్‌కు చిక్కిన లష్కరే తోయిబా ఉగ్రవాది.. ఏం చేశాడంటే Supreme Court - Constable కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకోవడంలో జరిగిన ఆలస్యంపై క్షమించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది. దీంతో ఇలా హైకోర్టులోనే వాదప్రతివాదనల వల్ల చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. 2021లో అలహాబాద్ హైకోర్టు సింగ్ బెంచ్.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. నాలుగు నెలల్లోగా వీరేంద్రకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనే దానిపై పరిశీలన చేయాలని సూచించింది. అయితే యూపీ ప్రభుత్వం.. ఈ నిర్ణయాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది. కానీ 2022లో అది తిరస్కరణకు గురైంది. అతడి కారుణ్య నియామకాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందేనని ఆదేశించింది. ఇది కూడా చదవండి: యువతి ప్రాణం తీసిన పల్లీలు.. అసలేమైందంటే? దీంతో యూపీ సర్కార్.. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ను సవాల్ చేసింది. అయితే యూపీ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీసుకున్న నిర్ణయంలో తమకు ఎక్కడా లోపం కనిపించలేదని చెప్పింది. ఆరు వారాల వ్యవధిలోనే వీరేంద్రపాల్ సింగ్‌కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తానికి 16 ఏళ్ల తర్వాత ఆ కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం జరిగింది. Also Read : ఇథనాల్ కంపెనీలో కొడుకుకు వాటా.. అది వాస్తవమేనన్న తలసాని శ్రీనివాస్! #supreme-court #telugu-news #national-news #uttar-pradesh #constable మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి