ఇథనాల్ కంపెనీలో కొడుకుకు వాటా.. అది వాస్తవమేనన్న తలసాని శ్రీనివాస్! ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తన కొడుకు కంపెనీ పెట్టాలనుకున్నది నిజమే కానీ అది ఇథనాల్ కాదన్నారు. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. By srinivas 28 Nov 2024 | నవీకరించబడింది పై 28 Nov 2024 15:05 IST in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Talasani : ఇథనాల్ కంపెనీలో తమకు వాటా ఉందనే ఆరోపణలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అసమర్ధ పాలనను కప్పి పుచ్చుకునేందుకే తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రి సీతక్క, ఎంపీ చామల కామెంట్స్ అడ్డగోలుగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై గురువారం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన తలసాని.. కాంగ్రెస్ నేతల ఆరోపణలన్నీ తప్పే అన్నారు. కంపెనీ వాళ్ళకే రాసిస్తా.. నా కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే.. కంపెనీ వాళ్ళకే రాసిస్తా. పీసీసీ చీఫ్ కు ఇదే నా సవాల్. ఇథనాల్ కంపెనీపై ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం. సందర్భం వచ్చినప్పుడు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తోన్న వారికి నేనేంటో చూపిస్తాను. ఇథనాల్ కంపెనీకి పర్మిమిషన్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. 2016 లో రాజమండ్రి ప్రాంతంలో నా కుమారుడు వేరే కంపెనీని పెట్టాలనుకున్నది వాస్తవం. అయితే మూడు నెలలకే కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశాడు. కంపెనీ పెట్టించే వాళ్లమైతే.. రైతులను మేమెందుకు రెచ్చగొడుతాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని పేర్కొనడం విడ్డూరం. ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అనే విషయం కూడా తెలుసుకోరా? బాధ్యతగల పదవిలో ఉన్నవారు ఆచీతూచీ ఆరోపణలు చేయాలని విమర్శించారు. ఇది కూడా చదవండి: యువతి ప్రాణం తీసిన పల్లీలు.. అసలేమైందంటే? ఇక ప్రజల సమస్యను పరిష్కరించకుండా.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందిని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని, లగచర్ల సహా ప్రతిదానిలో కాంగ్రెస్ ప్రభుత్వం అబాసు పాలవుతుందన్నారు. లేనివి ఉన్నట్లు చెప్పటం దుర్మార్గమైన చర్య. రైతులు చేస్తున్న ఆందోళనను పరిష్కరించకుండా తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. గురుకులాల్లో విద్యార్థుల మరణంపై కోర్టు మెట్టికాయలు వేసిన బుద్ధి రావట్లేదని అన్నారు. ఇది కూడా చదవండి: భారత్‌కు చిక్కిన లష్కరే తోయిబా ఉగ్రవాది.. ఏం చేశాడంటే #congress #brs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి