Ranya Rao: బంగారం స్మగ్లింగ్ కేసు.. ఈడీ చార్జిషీట్‌లో రన్యారావు పేరు

అక్రమంగా బంగారం తరలించిన కేసులో అరెస్టయిన నటి రన్యారావుకు మరో బిగ్ షాక్ తగిలింది. రూ.102 కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసుకు సంబంధించి తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)  ఆమె పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చింది.

New Update
Ranya Rao

Ranya Rao

అక్రమంగా బంగారం తరలించిన కేసు(gold-smuggling) లో అరెస్టయిన నటి రన్యారావు(heroine Ranya Rao) కు మరో బిగ్ షాక్ తగిలింది. రూ.102 కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసుకు సంబంధించి తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)  ఆమె పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. ఒక ఏడాదిలో ఏకంగా 127 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ సిండికేట్ భారత్‌కు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సిండికేట్‌కు చెందిన హ్యాండ్లర్లు, ఆభరణాల వ్యాపారులు దీన్ని భారత్‌ మార్కెట్‌లోకి చొప్పించినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. 

Also Read: రాజస్థాన్‌లో విషాదం..9 ఏళ్ల బాలికకు కార్డియాక్‌ అరెస్ట్‌

Actress Ranya Rao Named In 102-Crore Gold Smuggling Case

ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్న PMLA కోర్టులో ఈడీ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా అందులో రన్యా రావు పేరును కూడా చేర్చారు. ఆమెతో పాటు తన సహాయకుడిగా భావిస్తున్న తరుణ్ కొండూరు, బళ్లారికి చెందిన గోల్డ్‌ డీలర్ సాహిల్ జైన్ పేర్లను కూడా ఛార్జిషీట్‌లో చేర్చింది. ఇదిలాఉండగా గతేడాది దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్టులో రన్యారావును డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Also Read: సోషల్ మీడియా రారాజు మోదీ: ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల ఫాలోవర్లతో సరికొత్త ప్రపంచ రికార్డు!

ఆమె నుంచి 14.7 కిలోల బంగారన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె కొన్నేళ్లుగా ఈ అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో కలిసి ఆమె ఈ పనికి పాల్పడినట్లు తెలిపారు. ఇలా దుబాయ్ నుంచి బెంగళూరుకు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు భారీగా కమిషన్ తీసుకునేదని చెప్పారు. దీంతో ఈ కేసులో ఆమెకు ఏడాది పాటు జైలు శిక్ష పడింది. ప్రస్తుతం ఆమె బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోనే ఉన్నారు. తాజాగా ఈడీ కూడా మనీలాండరింగ్ కేసులో ఆమె పేరును చార్జిషీట్ దాఖలు చేసింది. 

Advertisment
తాజా కథనాలు