సోషల్ మీడియా రారాజు మోదీ: ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల ఫాలోవర్లతో సరికొత్త ప్రపంచ రికార్డు!

వరల్డ్ వైడ్ ఇంటర్‌నెట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ మరోసారి నిరూపితమైంది. ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల (10 కోట్లు) ఫాలోవర్ల మార్కును దాటిన తొలి ప్రపంచ నేతగా మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారు.

New Update
Modi

Modi

వరల్డ్ వైడ్ ఇంటర్‌నెట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ మరోసారి నిరూపితమైంది. ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల (10 కోట్లు) ఫాలోవర్ల మార్కును దాటిన తొలి ప్రపంచ నేతగా మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాధినేతలతో పోలిస్తే ఆయన ఆదరణ ఇప్పుడు అందనంత ఎత్తుకు చేరింది. నిరంతరం ప్రజలతో మమేకం కావడం, సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్లే ప్రధాని మోదీకి ఈ స్థాయి ప్రపంచ గుర్తింపు లభిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రపంచ నేతల కంటే ఎంతో ముందంజలో..

ప్రధాని మోదీ సాధించిన ఈ ఘనత ఎంతటిదంటే.. ప్రపంచంలోని తర్వాత ఐదుగురు ప్రముఖ దేశాధినేతల మొత్తం ఫాలోవర్ల సంఖ్యను కలిపినా, అది మోదీ వ్యక్తిగత ఫాలోవర్ల సంఖ్య కంటే తక్కువగా ఉండటం విశేషం. కేవలం ఫాలోవర్ల సంఖ్యలోనే కాదు, ప్రజల ఆమోదయోగ్యతలోనూ మోదీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

మోర్నింగ్ కన్సల్ట్ నివేదిక (ఫిబ్రవరి 2026): తాజా గణాంకాల ప్రకారం 67 శాతం రేటింగ్‌తో మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా నిలిచారు. చెక్ రిపబ్లిక్ నేత ఆండ్రెజ్ బాబిస్ (59 శాతం) రెండో స్థానంలో ఉండగా, ట్రంప్ 40 శాతంతో 11వ స్థానంలో ఉన్నారు.
స్టాటిస్టా నివేదిక (డిసెంబర్ 2025): ఆ సమయంలోనూ మోదీ 70 శాతం రేటింగ్‌తో ప్రథమ స్థానంలో నిలిచారు. ఆ సమయంలో జపాన్ ప్రధాని సనే తకైచి (63 శాతం) రెండో స్థానంలో ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు