Nepo Kids: నేపాల్లో జెన్ జీ ఉద్యమానికి కారణమైన నెపో కిడ్స్..వారి సోషల్ మీడియా పోస్ట్ లు

నేపాల్ జెన్ జీ ఆందోళనలను ఎంత విధ్వంసం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం పడిపోయింది. అక్కడ రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఈ ఉద్యమానికి ఒక కారణం నేపాల్ నెపో కిడ్స్ కూడా అని చెబుతున్నారు.

New Update
Nepo kids

సోషల్ మీడియా బంద్(Social Media Bandh) చేశారనే ఆగ్రహంతో నేపాల్ లో జెన్ జీ కిడ్స్(Nepal Gen Z protest) ఆందోళన చేశారు. ఇది కాస్తా హింసాత్మకంగా మారింది. దీని కారణంగా 34 మంది చనిపోగా మరో 1338 మంది గాయపడ్డారు. అలాగే అక్కడి ప్రభుత్వం కూడా కుప్పకూలిపోయింది. ప్రధాని మంత్రి ఓలీ శర్మ తో సహా..మంత్రులందరూ రాజీనామా చేశారు. ఈ అల్లర్లలో ప్రభుత్వ భవనాలు, హోటళ్ళు, రాజకీయ నేతల ఇళ్ళను ఆందోళనకారులు తగులబెట్టారు. చాలా మంది నేతలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పారిపోయారు. ప్రస్తుతం నేపాల్ ను ఆర్మీ తన చేతుల్లోకి తీసుకుంది. త్వరలోనే అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని నేపాల్ అధ్యక్షుడు చెప్పారు.

అయితే నేపాల్ లో జెన్ జీ యువత ఉద్యమం చేయడానికి కారణం ఒక్క సోషల్ మీడియానే కాదు..అక్కడి నెపో కిడ్స్ కూడా అని చెబుతున్నారు. నేపాల్ రాజకీయ నేతల పిల్లలు, వారి లగ్జరీ జీవితం, వాటిపై సోషల్ మీడియాలో పోస్ట్ లపై నేపాల్ యువత ఆగ్రహంగా ఉంది. సాధారణ నేపాలీలు నిరుద్యోగం, తీవ్ర పేదరికంతో పోరాడుతుంటే రాజకీయ నాయకుల పిల్లలు మాత్రం విలాసవంతమైన జీవితాలు జీవిస్తున్నారని జెన్ జీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అదే తిరుగుబాటుకు కేంద్రంగా మారింది.

Also Read :  కాల్పుల్లో చనిపోయిన వ్యక్తికి రాష్ట్రపతి మెడల్ ప్రకటించిన ట్రంప్

నెపో కిడ్స్ వైరల్ పోస్ట్ లు..

నేపాల్ రాజకీయ నేతల పిల్లల విలాస జీవనశైలి హైలెట్ చేసే పోస్ట్ లు, వీడియోలు టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్, రెడ్ ఇట్ లాంటి వాటిల్లో విస్తృతంగా వ్యాపించాయి. #PoliticiansNepoBabyNepal, #NepoBabies వంటి హ్యాష్‌ట్యాగ్‌ లతో మిలియన్ల వీక్షణలు పొందాయి. నేపాల్ నెపో కిడ్స్ లో మాజీ మిస్ నేపాల్, మాజీ ఆరోగ్య మంత్రి బిరోద్ ఖతివాడ కుమార్తె అయిన 29 ఏళ్ల శృంఖల ఖతివాడా ఉన్నారు. ఈమె సోషల్ మీడియా నిండా విదేశీ ప్రయాణాలు, లగ్జరీ లైఫ్ కు వైరల్ పోస్ట్‌లు ఉంటాయి. అందుకే నిరసనల సమయంలో శృంఖల ఇల్లును నిరసనకారులు తగులబెట్టారు. దీని తరువాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 1 లక్ష మందికి పైగా ఫాలోవర్స్ ను కోల్పోయారని తెలుస్తోంది.

ఈమె తరువాత నేపాల్ ప్రముఖ గాయని, మాజీ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవుబా కోడలు శివనా శ్రేష్టా పోస్ట్ లు కడ వరల్ అయ్యాయి. ఈమె తరుచుగా విలాసవంతమైన గృహాలు, ఖరీదైన ఫ్యాషన్‌ సామాగ్రిని ప్రదర్శించే వీడియోలను పోస్ట్ చేసేవారు. ఈె భర్త జైవీర్ సింగ్ దేవుబా కూడా కోట్లకు అధిపతి. మరో నెపో కిడ్ నేపాల్ న్యాయమంత్రి బిందు కుమార్ థాపా కుమారుడు సౌగత్ థాపా లగ్.రీ లైఫ్ ఫోటోలు సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాయి. అలాగే మాజీ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ "ప్రచండ" మనవరాలు స్మితా దహల్.. సోషల్ మీడియాలో లక్షల రూపాయల విలువైన హ్యాండ్‌బ్యాగులను ప్రదర్శించినందుకు విమర్శలు ఎదుర్కొన్నారు. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకారం, నేపాల్ ఆసియాలో అత్యంత అవినీతి దేశాలలో ఎప్పటి నుంచో స్థిరంగా ఉంది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ సమయంలో కనీసం $71 మిలియన్ల అవినీతి జరిగిందని పార్లమెంటరీ దర్యాప్తులో తేలింది. ఇవన్నీ నేపాల్ ప్రజల ఆగ్రహానికి దారి తీశాయి. తాము పేదరికంలో మగ్గిపోతుంటే..నేతలు, వారి పిల్లలు మాత్రం డబ్బుల్లో మునిగి తేలడాన్ని వారు సహించలేకపోయారు. ఎన్న ఏళ్ళుగా దాచిపెట్టుకున్న ఆగ్రహాన్ని ఒక్కసారిగా బయటపెట్టారు.

Also Read: US New Strategy: భారత్ పై అధిక సుంకాలు..జీ7 దేశాలపై అమెరికా ఒత్తిడి

Advertisment
తాజా కథనాలు