Crime News : రైలులో ఆరేళ్ల చిన్నారిని చంపి.. బాత్రూమ్ లో పడేసి..

గుజరాత్‌లో చిన్నారిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తున్న దుండగులు ఆమెను చంపి రైలు బాత్రూంలో పడేశారు. కిడ్నాప్‌ చేసి దుండగులు ఆ చిన్నారిని నాసిక్‌ తీసుకువెళ్లారు. నాసిక్‌ నుంచి ముంబయి వెళ్లే రైలు ఎక్కించి హత్య చేసి..దుండగులు బాత్రూంలోని చెత్తబుట్టలో కుక్కారు.

New Update
Six-year-old child murdered on train

Six-year-old child murdered on train

Crime News : బెంగళూరులో ఆరేళ్ల చిన్నారి హత్యకు గురైంది. గుజరాత్‌లో చిన్నారిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తున్న దుండగులు ఆమెను చంపి రైలు బాత్రూంలో పడేశారు. ఈ దారుణ ఘటన సంచలనంగా మారింది. చిన్నారిని కిడ్నాప్‌ చేసిన దుండగులు ఆమెను నాసిక్‌ తీసుకువెళ్లారు. నాసిక్‌ నుంచి ముంబయి వెళ్లే రైలు ఎక్కి చిన్నారిని హత్య చేసి..దుండగులు బాత్రూంలోని చెత్తబుట్టలో కుక్కారు. ఇది తెలిసిన వారి పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. 

గుజరాత్ కు చెందిన ఆరేళ్ల బాలికను దుండగులు ఎత్తు్కెళ్లారు. అ తర్వాత ఆమెను నాసిక్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ముంబాయి వెళ్లే కుషినగర్ ఎక్స్ ప్రెస్  ట్రైన్ ఎక్కించి దారుణంగా హతమార్చారు. ఆపై చిన్నారి మృతదేహాన్ని రైలు బాత్రూమ్ లోని చెత్తబుట్టలో కుక్కి పరారయ్యారు. అయితే ఆ రైలు లోకమాన్య తిలక్ టెర్మినస్ లో ఆగిన సమయంలో రైలులో మృతదేహాన్ని గుర్తించిన క్లీనింగ్ సూపర్ వైజర్ పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు పంపించారు.  

ఇది కూడా చూడండి:Dharmasthala Case: ధర్మస్థల కేసులో ఊహించని ట్విస్టులు.. సాక్షులు ఎందుకు మాట మార్చారు ? కారణం అదేనా

రైల్వే అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషినగర్ ఎక్స్ ప్రెస్ (22537) థర్డ్ ఏసీ కోచ్ (B2) టాయిలెట్ లోని చెత్తబుట్టలో ఆరేళ్ల చిన్నారి మృతదేహం బయటపడింది. శనివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ప్లాట్ ఫామ్ 4కు కుషినగర్ ఎక్స్ ప్రెస్ వచ్చి ఆగింది. దీంతో ప్లాట్ ఫారమ్ పై ఉన్న రైలును క్లీనింగ్‌ సిబ్బంది శుభ్రం చేస్తుండగా.. టాయిలెట్ చెత్తబుట్టలో చిన్నారి మృతదేహం కనిపించింది. వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీసులు, సీనియర్ రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పరిశీలించి, బుట్టలో నుంచి వెలికి తీసి రాజవాడి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. చిన్నారి గొంతుకోసి చంపి చెత్తబుట్టలో దాచినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.

ఇది కూడా చూడండి:Kukatpalli Murder Case: వాడిని చంపేయండి.. కన్నీళ్లు పెట్టిస్తున్న కూకట్‌పల్లి బాలిక తండ్రి ఆవేదన!

Advertisment
తాజా కథనాలు