Kukatpalli Murder Case: వాడిని చంపేయండి.. కన్నీళ్లు పెట్టిస్తున్న కూకట్‌పల్లి బాలిక తండ్రి ఆవేదన!

కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలికను పదో తరగతి చదువుతున్న బాలుడు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆ బాలిక తండ్రి పడిన ఆవేదన అందరినీ కట్టతడిపెట్టిస్తోంది. తన కూతురిని దారుణంగా హత్య చేసిన ఆ బాలుడికి ఉరిశిక్ష విధించాలని బాలిక తండ్రి డిమాండ్ చేశారు.

New Update
Kukatpally Murder Case

Kukatpally Murder Case

హైదరాబాద్‌(Hyderabad) లోని కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలికను పదో తరగతి చదువుతున్న బాలుడు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఆ బాలిక తండ్రి పడిన ఆవేదన అందరినీ కట్టతడిపెట్టిస్తోంది. తన కూతురిని దారుణంగా హత్య చేసిన ఆ బాలుడిని చంపేయాలని, ఉరిశిక్ష విధించాలని బాలిక తండ్రి డిమాండ్ చేశారు. ఆ బాలుడు ఎందుకు తమ కూతురిని ఎందుకు చంపాలని అనుకున్నాడో అని అడగాలని అనుకున్నాం. కానీ పోలీసుల వారు ఆ బాలుడితో మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదని అన్నారు. ఆ అబ్బాయి మా ఇంటి పక్కనే ఉంటాడు. మా అబ్బాయితో కలిసి ఆడుకుంటూ ఉంటాడు. ఆ బాలుడు చాలా పెద్దోడు.. క్రిమినల్ మైండ్ అని, చంపేయాలని ఆ బాలిక తండ్రి పోలీసులకు డిమాండ్ చేశారు. 

ఇది కూడా చూడండి: Kukatpally Murder Case: క్రికెట్‌ కిట్‌ కోసమే దొంగతనం చేసిన విద్యార్థి.. కూకట్‌పల్లి మర్డర్ కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు

కేసు ఏంటంటే?

కూకట్‌పల్లిలో ఓ కుటుంబం ఉంటుంది. వీరికి కొడుకు, కూతురు అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే తండ్రి బైక్ మెకానిక్‌గా పనిచేస్తుండగా, భార్య ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. కొన్నేళ్ల నుంచి వీరు కూకట్‌పల్లిలోనే నివసిస్తున్నారు. అయితే ఓ రోజు ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో ఓ 12 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. కొడుకుకు బాక్స్ ఇవ్వడానికి తండ్రి ఇంటికి రావడంతో బెడ్ మీద కత్తిపోట్లతో కూతరు పడి ఉంది. దీంతో తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

పదో తరగతి విద్యార్థి నిందితుడు..

12 ఏళ్ల బాలికను హత్య(Kukatpalli Murder Case) చేసింది పదో తరగతి బాలుడని పోలీసులు గుర్తించారు. అయితే బాలుడు దొంగతనం చేయడానికి వెళ్లగా ఆ బాలిక చూడటం వల్ల చంపేసినట్లు కూడా తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పదో తరగతి చదువుతున్న ఈ బాలుడు బాలిక ఇంట్లోకి వెళ్లాడు. రూ.80 వేలు దొంగలించాడు. ఈ సమయంలో 12 ఏళ్ల బాలిక చూడటంతో వెంటనే ఆమె పీకపిసికి చంపేశాడు. ఆ తర్వాత చనిపోయిందని కన్ఫార్మ్ చేసుకోవడానికి కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. అయితే దొంగతనం ఎప్పుడు? ఎలా చేయాలి? ఎవరైనా చేస్తే ఏం చేయాలని కూడా ముందే ఆ బాలుడు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తనకి వచ్చిన ఇంగ్లీషులో దొంగతనం వంటివి ఎలా చేయాలని నెట్ నుంచి వివరాలు సేకరించి వాటిని పేపర్‌పై రాసుకున్నాడు.

ఓటీటీలో క్రైమ్ సిరీస్ ఎక్కువగా..

నిందితుడు ఏపీలోని ఒంగోలుకి చెందిన వ్యక్తి. రెండేళ్ల క్రితమే నిందితుడి ఫ్యామిలీ ప్రస్తుతం ఉన్న ఫ్లాట్‌లోకి వచ్చారు. ఇదే ఏరియాలో నిందితుడి ఫ్యామిలీ కిరాణా షాప్‌ నడుపుతోంది. అయితే ఇటీవల ఆ బాలిక పుట్టిన రోజు జరిగింది. దీనికి వచ్చి ఆ నిందితుడు కేక్ తినిపించాడు. నిందితుడు అయిన ఆ బాలుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఎక్కువగా OTTలో క్రైమ్ సిరీస్‌ చూసే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నిందితుడు తండ్రి మద్యానికి బానిసయ్యాడు. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయితే క్రికెట్ కిట్ కోనుక్కోవాలని డబ్బులను దొంగలించినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే చోరీకి రెండు రోజులు ముందే నిందితుడు ప్లాన్ రాసుకున్నాడు. ప్లాన్ ప్రకారమే డబ్బులు దొంగతనం చేయగా.. ఆ బాలిక చూడటంతో దారుణంగా హత్య చేశాడు. 

ఇది కూడా చూడండి: Dharmasthala Case: ధర్మస్థల కేసులో ఊహించని ట్విస్టులు.. సాక్షులు ఎందుకు మాట మార్చారు ? కారణం అదేనా

Advertisment
తాజా కథనాలు