సికింద్రాబాద్లో విషాదం.. ఇద్దరు కూతుర్లను చంపి తండ్రి ఆత్మహత్య..!!
సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భవాని నగర్ లో కుటుంబ కలహాలతో తండ్రి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య కు పాల్పడ్డారు. తన కూతుర్లకు నిద్ర మాత్రలు ఇచ్చి అనంతరం తండ్రి కూడా నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మ్రుతుడు శ్రీకాంత్ సిల్వర్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కూతుళ్ళు శ్రావ్య (7),స్రవంతి(8) లకు నిద్ర మాత్రలు ఇవ్వడంతో చిన్నారులు చనిపోయారు.. ఒకేసారి కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో భవాని నగర్ లో విషాదఛాయలు అమ్ముకున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న బోయిన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్య గల కారణాలపై విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఐఫోన్ కోసం కన్న కొడుకుని అమ్మేసిన తల్లిదండ్రులు, కానీ చివరికి..
ఇటీవల చాలామంది ఫోనుతోనే కాలక్షేపం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తలదూర్చిన కొంతమంది మాత్రం పక్కన పెద్ద పిడుగుపడినా పట్టించుకోరు వీళ్లు. అంతలా ఫోన్లకు కనెక్ట్ అయిపోతున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామందికి చాలా క్రేజ్ వస్తోంది. దీనికి చదువు, అనుభవం పెద్దగా అక్కర్లేదు. కేవలం టాలెంట్ ఉంటే చాలు. కానీ ఇక్కడ ఐఫోన్ కోసం ఎవరు చేయని దారుణానికి తల్లిదండ్రులు ఒడిగట్టారు.ఏకంగా కన్న కొడుకునే అమ్ముకున్నారు. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్లో చోటుచేసుకుంది.