/rtv/media/media_files/2025/02/05/a5xj0tzjDSq3vG0RM5cG.jpg)
train accident in odisa Photograph: (train accident in odisa)
Odisa Train Accident: రైల్వే ట్రాక్ తప్పి.. ట్రైన్ గ్రామంలోని ఇళ్లపైకి దూసుకెళ్లిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఒడిశా రూర్కేలాలో రైలు ప్రమాదం సంభవించింది. పట్టాలపై ప్రయాణిస్తున్న గూడ్స్ ట్రైన్.. ఒక్కసారిగా పట్టాలు తప్పి జనావాసాలపైకి దూసుకెళ్లింది. ఇళ్లు, వాహనాలను ఢీకొడుతూ గ్రామంలోకి తీసుకెళ్లింది. మూడు బోగీలు పట్టాలు తప్పడంతో రైల్వే ట్రాక్ చుట్టుపక్కల ఉన్న ఇళ్లు గోడలు, రోడ్లుపై నిలిపిన వాహనాలు ధ్వంసం అయ్యాయి.
STORY | 3 wagons of goods train derail near Rourkela railway station
— Press Trust of India (@PTI_News) February 5, 2025
READ: https://t.co/5tjbThVlFH
VIDEO:
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/zMxgZjFphU
Also Read: పేరుకి గజదొంగ.. ప్రేమలో ఆణిముత్యం: చోరీ సొమ్ముతో ప్రియురాలికి రూ.3కోట్ల ఇల్లు!
గ్రామంలోకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు..
రూర్కెలాలోని బంసంతి కాలనీలో ఓ స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టింది ట్రైన్ బోగీలు. ప్రమాద సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో పలు వాహనాలు కూడా డ్యామేజ్ అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గూడ్స్ రైలు ఎలా పట్టాలు తప్పిందని విచారణ చేస్తున్నారు.
Also Read: ప్రముఖ వ్యాపారవేత్త పింకీ రెడ్డి ఫోన్ హ్యాక్! రిప్లై ఇవ్వదంటూ పోస్ట్
Also Read: మహాకుంభమేళాకు చేరుకున్న మోదీ... త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం