/rtv/media/media_files/2025/08/03/chidambaram-2025-08-03-15-28-16.jpg)
P.Chidambaram
ఈ ఏడాది చివర్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇటీవల అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహించింది. శుక్రవారం దీనికి సంబంధించి ముసాయిదా ఓటర్ లిస్టును విడుదల చేయగా దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో 65 లక్షల మంది తమ ఓటు హక్కు కోల్పోయారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో 6.5 లక్షల మంది ఓటర్లు పేరిగినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు.
Also Read: ఆరెంజ్ అలెర్ట్.. ఈ 55 జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు.. IMD హెచ్చరిక!
స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ (SIR) ప్రక్రియ ఆసక్తిగా ఉంటోంది. బిహార్‌లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. కానీ తమిళనాడులో 6.5 లక్షల ఓటర్ల సంఖ్య పెరిగింది. ఇలా జరగడం అనేది ఆందోళనకరమైనది, చట్టవిరుద్ధమైనది. పెరిగిన ఓటర్లను పర్మినెంట్ వలస కార్మికులుగా పిలిస్తే అసలైన వలస కార్మికులను అవమానించేనట్లే అవుతుంది. అలాగే తమిళనాడు ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఛాన్స్ ఇవ్వకుండా చేయడం కోసమే ఓట్లు పెరిగాయి. ఎలక్షన్ కమిషన్ తమ అధికారాలను దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాల ఎన్నికల విధానాలను మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి అధికార దుర్వినియోగాన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవాలని'' చిదంబరం అన్నారు. ఈ పోస్టుకు తమిళనాడు సీఎం కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు.
The SIR exercise is getting curiouser and curiouser
— P. Chidambaram (@PChidambaram_IN) August 3, 2025
While 65 lakh voters are in danger of being disenfranchised in Bihar, reports of "adding" 6.5 lakh persons as voters in Tamil Nadu is alarming and patently illegal
Calling them "permanently migrated" is an insult to the…
ఇదిలాఉండగా బిహార్‌లో విడుదల చేసిన ఓటరు జాబితా దుమారం రేపుతోంది. శనివారం రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా సంచలన ఆరోపణలు చేశారు. తన పేరు ముసాయిదా ఓటరు లిస్టులో లేదని.. తన పేరు లేకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలంటూ ఈసీపై ధ్వజమెత్తారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని.. ఓటర్ల హక్కును లాక్కోవడమేనని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు తేజస్వీ యాదవ్ పేరు ముసాయిదా ఓటర్ లిస్టులో లేకపోవడంపై పట్నా జిల్లా యంత్రాంగం కీలక వ్యాఖ్యలు చేసింది. తాము దీనిపై దర్యాప్తు చేపట్టామని.. ఆయన పేరు ముసాయిదా ఓటర్ లిస్టులో రిజిస్టర్ అయినట్లు చెప్పింది. ఈసారి తేజస్వీ యాదవ్ పేరు 416 సీరియల్ నెంబర్‌తో బిహార్ యానిమాల్ సైన్సెస్ లైబ్రరీ బిల్డింగ్‌లో 204 పోలింగ్ స్టేషన్ నెంబర్‌లో ఉందని తెలిపిందే. గతంలో అక్కడే 481 సీరియల్ నెంబర్‌తో 171 పోలింగ్ స్టేషన్ నెంబర్‌లో ఉందని చెప్పింది. తేజస్వీ యాదవ్ తన పాత EPIC నెంబర్‌తో చెక్ చేసుకొని ఉంటారని.. అందుకే తన పేరు ఓటరు జాబితాలో కనిపించలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.