/rtv/media/media_files/2025/08/03/capgemini-india-hiring-2025-08-03-11-47-35.jpg)
Capgemini India to Hire 45,000 in 2025, Prioritizes AI Skills
ఇటీవల కాలంలో ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు (లేఆఫ్స్) వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్టుల సంఖ్య తగ్గడం, కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి టెక్నాలజీలే ప్రధాన కారణాలుగా పలువురు చెబుతున్నారు. రీసెంట్‌గానే దేశీయ బడా ఐటీ కంపెనీ TCS తమ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగుల్లో సుమారు 2 శాతం మందిని తొలగించనున్నట్లు అనౌన్స్ చేసింది.
Capgemini India Hiring
అంటే దాదాపు 12,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడబోతుంది. వీరంతా ఇప్పుడు రోడ్డున పడబోతున్నారు. అయితే తమ ఉద్యోగులను ఎందుకు తీసేస్తున్నారో అనే కారణాన్ని కంపెనీ వెల్లడించింది. నైపుణ్యాల కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే మరో మూడు కంపెనీలు కూడా లేఆఫ్స్ ప్రకటించాయి. మైక్రోసాఫ్ట్, ఇంటెల్, అమెజాన్ వంటి కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి.
మరోవైపు మరో బడా ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. తమ కంపెనీ ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని పేర్కొంది. అది మాత్రమే కాకుండా.. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 20వేల మంది ఫ్రెషర్‌లను రిక్రూట్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.
ఇప్పుడు మరొక కంపెనీ కూడా అదిరిపోయే ప్రకటన చేసింది. ప్రముఖ ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం ‘క్యాప్‌జెమినీ’ భారతదేశంలో ఈ ఏడాది 40 వేల నుంచి 45 వేల మందిని రిక్రూట్ చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు క్యాప్‌జెమినీ ఇండియా సీఈఓ అశ్విన్ యార్డీ తెలిపారు. ఈ నియమకాల్లో సుమారు 35 శాతం నుంచి 40 శాతం మంది అనుభవజ్ఞులైన నిపుణులు ఉంటారని పేర్కొన్నారు.
#CapGemini to hire ~45,000 more in 2025, per
— ITPark_Vizag_India (@DigitalValley_) August 1, 2025
CEO Mr Ashwin Yardi #Indiapic.twitter.com/TuDh0bE9Hw
మిగిలిన వారు కొత్తగా కాలేజీల నుంచి వచ్చే ఫ్రెషర్స్ ఉంటారని స్పష్టం చేశారు. దీనికోసం కంపెనీ 50కి పైగా కాలేజీలు, క్యాంపస్‌లతో జట్టు కట్టిందని తెలిపారు. ప్రస్తుతం కంపెనీ భారతదేశంలో 1.75 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. కొత్తగా రిక్రూట్ అయిన వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో ట్రైనింగ్ ఇవ్వడంపై క్యాప్‌జెమినీ కంపెనీ ప్రత్యేక దృష్టి సారించనుందని తెలిపారు.
🚀 Capgemini India to Hire 40,000–45,000 Employees in 2025! 🇮🇳 pic.twitter.com/5dItkSyhcI
— Ajay Singh Rawat (@ajsinghrawat) August 2, 2025