/rtv/media/media_files/2025/06/06/hnHfBMAL4bqJKQqjpizN.jpg)
Weather Update
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడటం, కరెంట్ షాక్, వరదలు, బిల్డింగ్‌లు కూలిపోవడం సహా మరిన్ని కారణాల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, బీహార్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు విజృంభిస్తున్నాయి.
Weather Update
ఇదిలా ఉంటే తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో ఉత్తర ప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో బలమైన గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లక్నో, మౌ, గోరఖ్‌పూర్, బల్లియా, వారణాసి, సోన్‌భద్ర, మీర్జాపూర్, చందౌలి, జౌన్‌పూర్, ఘాజీపూర్, అజమ్‌ఘర్, కుషినగర్, డియోరియా, సంత్ కబీర్ నగర్, బస్తీ, సీతాపూర్, బారాబంకి, బహ్రైచ్, గోండా, శ్రావస్తి, లఖింపూర్ ఖేరి, హర్డోయి, మొరాదాబాద్ వంటి జిల్లాలతో సహా 55 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
వాతావరణ శాఖ ప్రకారం.. రాబోయే 24 గంటల్లో ఉత్తరప్రదేశ్ తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. లక్నో, పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదే సమయంలో తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో భారీ వర్షం (64.5 మిమీ నుండి 115.5 మిమీ) ఉంటుందని హెచ్చరిక జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలులు (గంటకు 30-55 కిమీ), మెరుపులు కూడా వచ్చే ప్రమాదం ఉందని ప్రజలను అలర్ట్ చేసింది. ఇందులో భాగంగానే IMD పలు జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది.
తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర, మీర్జాపూర్, చందౌలీ, బల్లియా, డియోరియా, గోరఖ్‌పూర్, సంత్ కబీర్ నగర్, వారణాసి, భదోహి, జౌన్‌పూర్, ఘాజీపూర్, అజంగఢ్, మౌ, కుషీనగర్, అంబేద్కర్ నగర్ జిల్లాల్లో హెచ్చరికలు జారీ చేసింది. అలాగే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్, సంభాల్, హర్దోయి, సీతాపూర్, బారాబంకి, బహ్రైచ్, గోండా, శ్రావస్తి, లఖింపూర్ ఖేరీ, సహరాన్‌పూర్, మీరట్, నజీబాబాద్ జిల్లాలతో పాటు మధ్య ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, కాన్పూర్, కాస్గంజ్, హత్రాస్ జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది.
ఇదిలా ఉంటే.. గత 24 గంటల్లో మొరాదాబాద్ (270 మి.మీ), సంభాల్ (210 మి.మీ), హర్దోయ్ (170 మి.మీ), బారాబంకి (320 మి.మీ) వంటి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. దీని కారణంగా అనేక గ్రామాల్లో వరదలు వచ్చే ప్రమాదం పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో పంటలకు నష్టం, చదును చేయని రోడ్లకు నష్టం వాటిళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది