/rtv/media/media_files/2026/03/02/west-bengal-2026-03-02-07-20-43.jpg)
50 lakh infiltrators removed from Bengal voter list
పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 63.66 లక్షల ఓటర్లను తొలగించారు. అయితే వీళ్లలో 50 లక్షలకు పైగా చొరబాటుదారులవేనని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నితన్ నబీర్ వెల్లడించారు. బీజేపీ చేపట్టిన పొరిబోర్టన్ యాత్రను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: పెళ్లి చేసుకుంటానని ఒకడు, సాయం చేస్తానని మరొకడు అత్యాచారం.. పాపం చివరికి!
రాష్ట్రంలో 50 లక్షలకు పైగా చొరబాటుదారులను ఓటరు లిస్టు నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. వీళ్లు పౌర హక్కులను ఉల్లంఘించి దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టారంటూ మండిపడ్డారు. దేశ ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు వీళ్లు పొందుతున్నట్లు ఆరోపించారు. సీఎం మమతా బెనర్జీ వాళ్లకి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి రక్షణ కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: మార్చి 1 నుండి.. LPG ధరలు, సిమ్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ సహా భారీ మార్పులు ఇవే..!
టీఎంసీ ఓటరు బ్యాంకు అయిన చొరబాటుదారులను ఈ లిస్ట్ నుంచి తొలగించకుండా ఉండేందుకు మమతా బెనర్జీ కోర్టులో పిటిషన్ వేసినట్లు చెప్పారు. అక్రమ వలసదారులు రాష్ట్రాన్ని వదిలివెళ్లే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. చొరబాటుదారుల కోసం పనిచేస్తున్న అవినీతి ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి విముక్తి కల్పించాలంటూ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు నిజమైన మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.
Follow Us