Floods: భయపెడుతున్న వర్షాలు.. 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్

దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు భయపెడుతున్నాయి. వరదలు పోటెత్తడంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

New Update
50-km Traffic Jam On Chandigarh-Kullu Highway

50-km Traffic Jam On Chandigarh-Kullu Highway

దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు(Heavy Rains) భయపెడుతున్నాయి. వరదలు(Floods) పోటెత్తడంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్లన్ని మూసుకుపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చండీగఢ్‌-కులూమనాలి జాతీయ రహదారి చాలాచోట్ల బ్లాక్ అయిపోయింది. వేలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దాదాపు 50 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించిపోయినట్లు అధికారులు తెలిపారు. 

Also Read: 27ఏళ్ల క్రితమే అమెరికా ఆంక్షలు ఎదుర్కొన్న ఇండియా.. 1998 తర్వాత జరిగిందే రిపీట్ చేస్తే భారత్ సేఫ్

50-Km Traffic Jam On Chandigarh-Kullu Highway

ఢిల్లీకి ఈ జాతీయ రహదారిలోనే ఎక్కువగా పండ్లు, కూరగాయలు రవాణా అవుతాయి. ఈ రూట్‌లో వచ్చిన ట్రక్కులన్నీ కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాయి. దీనివల్ల ప్రయాణికుల వాహనాలను అధికారులు నిలిపివేశారు. నిత్యావసర వస్తువుల రవాణాకు మాత్రం ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో సాధారణ ప్రయాణికులు రోడ్డుపై గంటల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. పలువురు ఆందోళనకు కూడా దిగారు. చివరికి అధికారులే ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.  

ఇదిలాఉండగా తెలంగాణ(Telangana) లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వరదలు పోటేత్తాయి. అనేక చోట్ల జనజీవనం స్తంభించింది. చాలాప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమైపోయాయి. బీబీపేట నుంచి కామారెడ్డికి వెళ్లే రూట్‌లో వరద ప్రవహానికి వంతెన కొట్టుకుపోయింది. మరోవైపు క్యాసంపల్లి శివారులో వరద ప్రభావానికి జాతీయ రహదారి బైపాస్‌ రోడ్డుపై భారీ గుంతలయ్యాయి. దీనివల్ల నిజామాబాద్‌ వైపు కూడా రాకపోకలు నిలిచిపోయాయి.

Also Read :  ట్రంప్ టారిఫ్‌లా.. రష్యా చమురు కొనుగోళ్లా.. ఇండియాకి ఏది బెటర్..?

అంతేకాదు రాష్ట్రంలో గురువారం కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. అంతేకాదు భారీ వర్షాల కారణంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలు కుడా ఈరోజు మూసివేశారు. 

Advertisment
తాజా కథనాలు