Caste Census: తెలంగాణలో బీసీల శాతం ఎంతంటే ?.. ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

కులగణనకు సంబంధించిన వివరాలు కమిషన్‌.. సబ్‌కమిటీకి వివరించింది. బీసీ కోటాపై రేవంత్ సర్కార్.. దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించనుంది. కులగణన సర్వేలో 55.85 శాతం బీసీలు ఉన్నట్లుగా తేల్చారు.మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.

New Update
Uttam kumar Reddy

Uttam kumar Reddy

ఆదివారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన సబ్‌కమిటీ సమవేశం జరిగింది. కులగణనకు సంబంధించిన వివరాలు కమిషన్‌.. సబ్‌కమిటీకి వివరించింది. బీసీ కోటాపై రేవంత్ సర్కార్.. దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించనుంది. అయితే కులగణన సర్వేలో55.85 శాతం బీసీలు ఉన్నట్లుగా తేల్చారు. కొత్తగా వచ్చిన లెక్కల ప్రకారం.. పథకాలు, రిజర్వేషన్లు అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.  

Also Read: ఢిల్లీలో గెలిచేది ఆ పార్టీయే.. ప్రీపోల్‌ సర్వేలో సంచలన విషయాలు

ఈ సర్వే వివరాలను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వివరించారు. '' తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వే చేపట్టింది. మొత్తం 50 రోజుల పాటు ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 1,03889 మంది అధికారులు పాల్గొన్నారు. 96.9 శాతం కుటుంబాలను సర్వే చేశారు. 3.54 కోట్ల మంది తమ ఈ సర్వేలో తమ వివరాలు వెల్లడించారు. 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని కమిషన్ నివేదికలో తెలిపింది. ఫిబ్రవరి 5న మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుందని'' ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 

కులగణన సర్వే ప్రకారం తెలంగాణలో సామాజిక వర్గాల వారి జనాభా శాతం

ఎస్సీలు - 17.43 శాతం
ఎస్టీలు -  10.45 శాతం
బీసీలు -  46.25
ముస్లిం మైనార్టీ బీసీలు - 10.08 శాతం
ముస్లిం మైనార్టీ సహా బీసీలు -  56.33 శాతం 
ముస్లిం మైనార్టీ ఓసీలు - 2.48 శాతం
మొత్తం ముస్లిం మైనార్టీ జనాభా - 12.56 శాతం
మొత్తం ఓసీలు - 15.79 శాతం 

Also Read: కుంభమేళాలో 'అయోధ్య రామ మందిరం'.. తెలుగు వ్యక్తి టాలెంట్ కి ఫిదా అయిన భక్తులు!

సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కులగణన చేపట్టామని ఉత్తమ్ అన్నారు. ఈ నివేదిక ద్వారా వెనకబడ్డ వర్గాలకు న్యాయం జరుగుతునందని పేర్కొన్నారు.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంత్రులు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలాఉండగా.. బీసీలకు 40 శాతం కోటా పెంచుతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Also Read: కేజ్రీవాల్ విలవిల.. ట్యాక్స్ మినహాయింపు వెనుక మోదీ వ్యూహం ఇదే!

Also Read: జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే...సీబీఐ స్పెషల్‌ కోర్టు తీర్పు!

Advertisment
తాజా కథనాలు