/rtv/media/media_files/2025/01/26/BfEDJurTWiidi4ofb5VK.jpg)
Maha Kumbh Viral Girl Monalisa
ఈ మధ్య కాలంలో మోనాలిసా పేరు అంటే తెలియని వారు ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికి కూడా 16 ఏళ్ల మోనాలిసా గురించి తెలుసు. మధ్య ప్రదేశ్‌కి చెందిన ఈ యువతి కుటుంబం కోసం కుంభమేళాలో పూసలు అమ్మేది. ఈమె నీలి కళ్లతో భారత్ మొత్తం ఫేమస్ అయ్యింది. కుటుంబ పరిస్థితి బాగులేక.. 12 ఏళ్ల వయస్సులోనే చదువు ఆపేసి రుద్రాక్ష పూసలు విక్రయించేది. కుంభమేళా సందర్భంగా ఆమె పూసలు విక్రయిస్తుండగా.. కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ చేశారు. దీంతో ఆమె పూసలు అమ్మకుండా ఇంటికి వెళ్లిపోయింది.
ఇది కూడా చూడండి: Jayalalitha: జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే...సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!
The viral girl from #KumbhMela2025, Monalisa, revealed that #SalmanKhan is her favourite actor & that she admires everything about him ❤️❤️ @BeingSalmanKhan pic.twitter.com/29G8BxXeVq
— SALMAN KI SENA™ (@Salman_ki_sena) January 26, 2025
ఇది కూడా చూడండి: CM Chandrababu: ఇలాంటి బావమరిది దొరకడం నా అదృష్టం.. చంద్రబాబు ఎమోషనల్!
ఫేవరేట్ హీరో ఇతనే..
ఫేమస్ అవ్వడం వల్ల ఆమెకు ఆర్థికంగా ఇబ్బంది వచ్చింది. కానీ ఒక్కసారిగా ఆమెకు అదృష్ట దేవత తలుపు తట్టింది. ఒక్కసారిగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. గాంధీగిరి, ది డైరీ ఆఫ్ బెంగాల్ వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఆఫర్ ఇచ్చాడు. తన తర్వాత చిత్రం ది డైరీ ఆఫ్ మణిపూర్‌లో మోనాలిసా నటించబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి సంతకం కూడా చేయించుకున్నారు. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మోనాలిసాకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అంటే ఇష్టమట. హీరోయిన్ సోనాక్షి సిన్హా అంటే ఇష్టమని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
ఇది కూడా చూడండి: AP Crime: కొడుకును నెత్తురు కక్కేలా కొట్టిన తండ్రి.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే!
ఇది కూడా చూడండి: RC16: 20 ఏళ్ళు వెనక్కి వెళ్లి.. RC16 షూటింగ్ కోసం బుచ్చిబాబు పెద్ద ప్లానింగ్!