Jammu kashmir: ‘ఆపరేషన్ మహదేవ్‌’.. పహల్గాం ఉగ్రవాదులను ఎలా లేపేసారో తెలుసా ?

ఆపరేషన్ మహదేవ్‌ పేరుతో భారత సైన్యం, CRPF సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే మృతి చెందిన ఉగ్రవాదులు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డవాళ్లేనని ప్రచారం నడుస్తోంది.

New Update
3 suspected Pahalgam terrorists killed in encounter on Srinagar outskirts

3 suspected Pahalgam terrorists killed in encounter on Srinagar outskirts

జమ్మూకశ్మీర్‌లోని దాచిగమ్ నేషనల్ పార్క్‌ దగ్గర్లోని భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ మహదేవ్‌ పేరుతో భారత సైన్యం, CRPF సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే మృతి చెందిన ఉగ్రవాదులు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డవాళ్లేనని ప్రచారం నడుస్తోంది. పాక్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తయిబాకు వీళ్లకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు పహల్గాం ఉగ్రవాదులేనని భారత సైన్యం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. 

Also Read: ఛీ ఛీ.. గబ్బిలాలతో చిల్లీ చికెన్ - రాష్ట్రంలో బయటపడ్డ మోసం

ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దులో భారత సైన్యం మరింత అప్రమత్తమైంది. అయితే హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం వచ్చింది. దీంతో నెల రోజుల నుంచి భారత సైన్యం, CRPF బలగాలు ఆపరేషన్ మహదేవ్ పేరుతో గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం ఉదయం దాచిగమ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇక భద్రతా సిబ్బంది కూడా ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. 

ఈ కాల్పుల్లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు కార్టన్ సెర్చ్‌ చేపట్టాయి. ఘటనాస్థలంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. హతమైన ఉగ్రవాదులు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డవాళ్లేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మృతదేహాలను పరిశీలించిన తర్వాతే వాళ్ల వివరాలు తెలుస్తాయని అధికారులు చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలోనే ఈ ఆపరేషన్‌ను చేపట్టామని పేర్కొన్నారు. మరి ఆ మృతులు పహల్గాం ఉగ్రవాదులేనా ? కాదా ? అనేది తెలియాలంటే మరికొన్నిగంటలు వేచిచూడాల్సిందే. 

Also Read: ప్రియుడితో తల్లి రాసలీలలు.. కొడుకు తిట్టడంతో.. అతి కిరాతకంగా తల్లి ఏం చేసిందంటే?

ఇదిలాఉండగా ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. బైసరన్ లోయ వద్ద ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 25 మంది పర్యాటకులతో పాటు ఒక కశ్మీరీ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన తర్వాత ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో అప్పటి నుంచి సరిహద్దుల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేటను కొనసాగిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి లష్కరే తయిబా అనుబంధ సంస్థ అయిన 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌' బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రవాదుల్లో ఒక్కొక్కరి తలపై రూ.20 లక్షల రివార్డు కూడా ఉంది. మరోవైపు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఆపరేషన్ సిందూర్ కూడా కొనసాగుతోందని ఉన్నతాధికారులు తెలిపారు.  

Advertisment
తాజా కథనాలు