ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల, మావోయిస్టుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మావోలు మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గరియాబాద్ జిల్లా సోర్మామల్ అటవీ ప్రాంతంలో మవోయిస్టులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసులతో పాటు.. ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అంతేకాదు ఒడిశాలోని నవరంగపూర్‌కు చెందిన సైనికులు కూడా ఆ ప్రాంతాన్ని చుట్టేశారు.
Also Read: ఆ ఇద్దరు మంత్రులు ఔట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!
చివరకి భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఆ తర్వాత అక్కడ దొరికిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇంకా ఆ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. ఈ మధ్యకాలంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య వరుసగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు.
Also Read:ఓరి దేవుడా.. రెండు బస్సుల మధ్య ఇరుక్కున్నా ఎలా బతికావ్ రా బాబు!
ఇదిలాఉండగా.. ఇటీవలే బీజాపుర్ జిల్లాలో కూడా భద్రతా బలగాలు, మావోయిస్టు దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అలాగే అబూజ్ మడ్ అడవిప్రాంతంలో సైతం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. నారాయణపూర్, దంతేవాడ అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ కాల్పులు జరిగాయి.
Also Read: కట్టలు తెంచుకున్న 20ఏళ్ల నాటి వైరస్.. చైనా నుంచి జపాన్‌కు.. నెక్ట్స్ ఇండియాకు?