Actor Lakshmi Menon Summoned: పరారీలో మలయాళ నటి లక్ష్మీ మేనన్.. కిడ్నాప్ కేసులో ఆమె పేరు

మలయాళ నటి లక్ష్మీ మేనన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపించడమే ఇందుకు కారణం. స్నేహితులతో కలిసి దాడి చేశారని చెబుతున్నారు. 

New Update
lakshmi

Actress Lakshmi Menon

Actor Lakshmi Menon Summoned: మలయాళ నటి లక్ష్మీ మేనన్ అందరికీ సుపరిచితురాలు. అయితే ఆమె ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నారు. ఓ బార్ దగ్గర జరిగిన గొడవలో ఈమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బార్ దగ్గర లక్ష్మీ మేనన్, ఐటీ ఉద్యోగులకు మధ్య గొడవ అయింది. అది అక్కడతో ఆగిపోలేదు. ఐటీ ఉద్యోగుల మీద విపరీతమైన కోపంతో వారిని లక్ష్యీ మేనన్, ఆమె స్నేహితులు వెంబడించారు. అంతే కాదు వారి కారును అడ్డుకుని...అందులో ఒకరిని తమ కారు బలవంతంగా ఎక్కించుకున్నారు. దాడి కూడా చేశారని కూడా తెలుస్తోంది. ఆ తర్వాత అతడిని కిడ్నాప్ చేశారని చెబుతున్నారు. అయితే అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నటి, ఆమె స్నేహితుల మీద కేసు నమోదు చేశారు. 

పరారీలో నటి..

ఈ కేసు బయటకు రావడంలో లక్ష్మీ మేనన్ ఎవరికీ కనిపించకుండా పోయారు. ఆమె స్నేహితులు ముగ్గురిని అరెస్ట్చేశామని...అయితే నటి మాత్రం పరారీలో ఉన్నారని కొచ్చి నగర పోలీస్‌ కమిషనర్‌ విమలాదిత్య తెలిపారు. ప్రస్తుతం లక్ష్మీ మేనన్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. అయితే, ఆమె పేరును ఎఫ్‌ఐఆర్‌లో ఇంకా చేర్చలేదని చెబుతున్నారు. ‘గజరాజు’, ‘ఇంద్రుడు’, ‘చంద్రముఖి 2’, ‘శబ్దం’ తదితర డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె పరిచయం అయ్యారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: వైష్ణోదేవి యాత్రలో తీవ్ర విషాదం.. 30 మందికి పైగా మృతి

Also Read: J&K Tragedy: 35కు చేరుకున్న వైష్ణోదేవి యాత్ర మృతుల సంఖ్య..డేంజర్ గా జీలం నది