Punjab Floods: పంజాబ్ ను ముంచెత్తిన వర్షాలు.. మునిగిన స్కూల్..400 మంది పిల్లలు వరద నీటిలో..

పంజాబ్ లో విపరీతంగా కురిసిన వర్షాలకు గురుదాస్ పూర్ లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయం నీటిలో మునిగిపోయింది. అందులో ఉన్న 400 మంది పిల్లలు, స్కూలు సిబ్బంది వరద నీటిలో చిక్కుకుపోయారు. 

New Update
school

Over 400 students and staff at a Gurdaspur residential school were stranded as floodwaters submerged the ground floor

దేశంలో ఈ ఏడాది వర్షపాతం అధికంగా నమోదవుతోంది. చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. జమ్మూ, కాశ్మీర్ లో పరిస్థితులు అతలాకుతలంగా ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడా వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. మరోవైపు పంజాబ్ లో విపరీతమైన వర్షాలకు అక్కడి జనజీవనం స్తంభించి పోయింది. ఈ వర్షాల కారణంగా గురుదాస్ పూర్ లోని దబురిలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయం వరద నీటిలో మునిగిపోయింది. స్కూల్ గ్రౌండ్ ఫ్లోర్ లో నాలుగు అడుగుల కంటే ఎక్కువగా నీరు చేరిపోయింది. దీంతో 400 మంది విద్యార్థులు, స్కూలు సిబ్బంది వరద నీటిలో చిక్కుకుని పోయారు. 

సహాయక చర్యలు చేపట్టిన జాతీయ విపత్తు బృందం

స్కూలు పరిస్థితుల సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు బృందం, సైన్యం అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలను ప్రారంభించారు. పిల్లలను, సిబ్బందిని భద్రత కోసం మొదటి అంతస్తుకు తరలించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కూడా గురుదాస్ పూర్ కు చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను వైమానికి సర్వే చేశారు. దగ్గరలో ఉన్న బ్రహ్మంపూర్ లో తన హెలికాఫ్టర్ ను ఉంచి..అత్యవసర చర్యల కోసం సిద్ధంగా ఉంచమని ఆదేశాలను జారీ చేశారు. 

ఈ నెల 30 వరకు స్కూళ్ళ మూసివేత

పంజాబ్ లో కురుస్తున్న వర్షాలకు సరిహద్దుల్లో ఉన్న నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆనకట్టల నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ...ఇంకా నదిలో నీరు ప్రమాదస్థాయిని మించే ఉంది. దీని కారణంగా అమృత్సర్, పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ ,తర్న్ తరణ్‌లలో వరదలు సంభవించాయి. భారీ వర్సాల కారణంగా రాష్ట్రంలో అన్ని సకూళ్ళకు ఈ నెల 30 వరకు సెలవులను ప్రకటించారు. మరోవైపు రావి నదికి వరదలు రావడంతో పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ ఏడు అడుగుల లోతున మునిగిపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి. 

Also Read: US Tariffs : అమెరికా అదనపు సుంకాలు.. భారత ప్రభుత్వ వ్యూహం

Advertisment
తాజా కథనాలు