/rtv/media/media_files/2025/10/26/fake-2025-10-26-15-12-46.jpg)
22 fake universities in India, Delhi institute among them, UGC warns
దేశంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ కోట్లా ముబారక్‌పుర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ పర్మిషన్లు లేని డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఆ సంస్థ జారీ చేసే డిగ్రీ పట్టాలకు ఎలాంటి విలువ లేదని చెప్పింది. అంతేకాదు ఈ యూనివర్సిటీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనకు సంబంధించి ఏ చట్టం కింద ప్రారంభించలేదని స్పష్టం చేసింది.
Also Read: భారత్ సహా నాలుగు దేశాలను కుదిపేసిన భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
దేశంలో మొత్తంగా 22 గుర్తింపు లేని యూనివర్సిటీలను నిర్వహిస్తున్నట్లు యూజీసీ డేటాలో తేలింది. ఇందులో తొమ్మిది యూనివర్సిటీలు ఢిల్లీలోనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో అయిదు ఉన్నాయి. ఇక మిగిలినవి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరిలో ఉన్నట్లు డేటా గణంకాలు చెబుతున్నాయి.
Also Read: వివాహేతర సంబంధాల్లో బెంగళూరు నెంబర్ వన్..టాప్ 5లో ఈ నగరాలు..
ఇలాంటి ఫేక్ యూనివర్సిటీలు ముఖ్యంగా ఢిల్లీలోని స్టూడెంట్స్‌ను ఆకర్షిస్తున్నాయి. తమ సంస్థలకు పేర్లు పెట్టే సమయంలో నేషనల్, మేనేజ్‌మెంట్, ఇన్‌స్టిట్యూట్, టెక్నాలజీ లాంటి పదాలను వినియోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అయితే పరిషద్, విద్యాపథ్, ఓపెన్ యూనివర్సిటీ లాంటి పదాలు వాడుతున్నారు. విద్యార్థులు ఏదైనా సంస్థలో చేరేటప్పుడు దాని పేరు సెక్షన్ 2(ఎఫ్) లేదా 3 కింద UGC గుర్తించిన లిస్టులో ఉందో? లేదో ? చూడాలి. AICTC, PCI, NMC లాంటి కౌన్సిల్స్ నుంచి ఆయా సంస్థల్లో ఏ కోర్సులు నిర్వహించేందుకు పర్మిషన్లు వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇలా ఫేక్ యూనివర్సిటీలో చదివి గుర్తింపు లేని డిగ్రీలను పొందాల్సి వస్తుంది.
Also Read: కెనడాకు ట్రంప్ భారీ షాక్..దానిపై అదనపు ట్యాక్స్
Follow Us