Trump Tariffs on Canada: కెనడాకు ట్రంప్‌ భారీ షాక్‌..దానిపై అదనపు ట్యాక్స్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌  ప్రపంచ దేశాలపై తన సుంకాలతో విరుచుకుపడుతున్నారు. అందరిపై ట్యాక్స్‌ లు విధిస్తూనే ఉన్నాడు. తాజాగా కెనడాకు భారీ షాక్‌ ఇచ్చాడు.కెనడా దిగుమతులపై మరో 10 శాతం సుంకం విధిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించాడు.

New Update
Trump's big shock to Canada..additional taxes on it

Trump's big shock to Canada..additional taxes on it

Trump Tariffs on Canada: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌  ప్రపంచ దేశాలపై తన సుంకాలతో విరుచుకుపడుతున్నారు. మిత్ర, శతృ దేశాలనే తేడా లేకుండా అందరిపై ట్యాక్స్‌ లు విధిస్తూనే ఉన్నాడు. తాజాగా కెనడాకు భారీ షాక్‌ ఇచ్చాడు.కెనడా దిగుమతులపై మరో 10 శాతం సుంకం విధిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించాడు.అయితే సుంకాలను వ్యతిరేకిస్తూ కెనడాలోని ఓంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం స్పాన్సర్ చేసిన ఓ యాడ్‌ విషయం ట్రంప్‌కు కోపం తెప్పించింది. దానిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కెనడా దిగుమతులపై తాజాగా 10 శాతం అదనపు సుంకాన్ని విధించారు.

Also Read: High Paying Jobs: ఫ్రెషర్లకు బెస్ట్ ఆప్షన్స్.. ఈ 5 ఉద్యోగాలకు లక్షల్లో జీతం.. అనుభవం అవసరమే లేదు!
 
సుంకాలను వ్యతిరేకిస్తూ కెనడాలోని ఓంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రసారమైన ఓ ప్రకటనతో ట్రంప్‌ తీవ్ర ఆగ్రహానికి గురైయ్యాడు. మరోసారి సుంకాలను మళ్లీ పెంచారు. ట్రంప్‌ విధించే సుంకాలతో అమెరికా జనాలకే నష్టం కలుగుతుందంటూ రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ 1987లో చేసిన ప్రసంగాన్ని ఓంటారియో ప్రభుత్వం తన ప్రకటనలో చేర్చింది. ఇలాంటి సుంకాలతో వాణిజ్య యుద్ధాలు మొదలవుతాయని అప్పట్లో ఆయన హెచ్చరించారు. అయితే ఇది ట్రంప్‌ కు అగ్రహాం తెప్పించింది.

ఈ యాడ్‌పై మండిపడ్డ ట్రంప్ రెండు రోజుల క్రితమే కెనడాతో వాణిజ్య చర్చల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. దీంతో యాడ్‌ను తొలగిస్తామని ఓంటారియో ప్రభుత్వం ప్రకటించింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ వివరించారు. అయితే, ఈ వారాంతం వరకు మాత్రం యాడ్ కొనసాగుతుందని అన్నారు. ఈ నిర్ణయం ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించడంతో కెనడాపై అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘వాళ్లు యాడ్‌ను వెంటనే తొలగించి ఉండాల్సింది. కానీ నిన్నటి క్రీడల్లో భాగంగా యాడ్‌ను ప్రదర్శించారు. అది మోసమని తెలిసీ తమ తీరు మార్చుకోలేదు. ఇది దుందుడుకు చర్య. కాబట్టి కెనడాపై అదనంగా 10 శాతం సుంకాన్ని విధిస్తున్నాను’ అని ట్రంప్‌ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

అమెరికా ఇప్పటికే కెనడాపై 35 శాతం సుంకాన్ని విధిస్తోంది. దీనితో పాటు రంగాల వారీగా లెవీలు కూడా విధిస్తోంది. కెనడా నుంచి దిగుమతయ్యే ఖనిజాలపై 50 శాతం లెవీ, ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25 శాతం లెవీ కూడా విధిస్తుంది. అయితే, రెండు దేశాల మధ్య ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా చాలా ఉత్పత్తులకు సుంకాల నుంచి మినహాయింపు కూడా ఉంది. అమెరికా, కెనడా మధ్య చాలా కాలంగా వాణిజ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే జీ7 దేశాల్లో కెనడా మాత్రమే ఇప్పటివరకూ అమెరికాతో ఎలాంటి ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోవడం గమనార్హం. అమెరికా సుంకాల కారణంగా కెనడా ఆటోమొబైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడినట్లు ఆ దేశం ప్రకటించింది.

Also Read: ఐక్యరాజ్యసమితిని తప్పుబట్టిన విదేశాంగ మంత్రి.. UNOపై విమర్శలు గుప్పించిన జైశంక‌ర్

Advertisment
తాజా కథనాలు