Bengaluru: వివాహేతర సంబంధాల్లో బెంగళూరు నెంబర్ వన్..టాప్ 5లో ఈ నగరాలు..

పెళ్ళి అయి పిల్లలు ఉన్నా వివాహేతర సంబంధాలు నెరుపుతున్న వారిలో బెంగళూరు నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. గ్లీడెన్ చేసిన సర్వేలో బెంగళూరు అగ్ర స్థానంలో ఉండగా.. ముంబై రెండో స్థానంలో, కోల్‌కతా మూడో స్థానంలో, ఢిల్లీ నాలుగో స్థానంలో, పుణె ఐదో స్థానంలో నిలిచాయి.

New Update
affairs

ఈ మధ్య కాలంలో హత్యలు...దాని వెనుక వివాహేతర సంబంధాలు ఎక్కువ అయిపోతున్నాయి. రోజుకు వీటికి సబంధించిన వార్తలు ఓ ఐదారైన వస్తున్నాయి. పెళ్లై భర్త పిల్లలు ఉన్న స్త్రీ, పురుషులు కూడా ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటూ చాలా మంది  తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భారత దేశంలో ఇలాంటి వారు ఎక్కడ ఎక్కువగా ఉన్నారని చేసిన సర్వేలో ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. ఎక్కువగా ఇలాంటి వారు ఏ నగరంలో ఉన్నారు, ఏ ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి, ఏ రంగంలో ఉన్నవారు ఎక్కువగా భర్త, భార్యను వదిలేసి వేరే వాళ్లతో కాపురాలు చేస్తున్నారోనని గ్లీడెన్ సంస్థ ఓ సర్వే చేసింది.

చదవుకున్న వారే ఎక్కువ..

ఇందులో భారత్‌లో వివాహేతర సంబంధాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ముంబయి రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో కోల్‌కతా, నాలుగో స్థానం ఢిల్లీ, ఐదో స్థానంలో పుణె నగరాలు ఉన్నాయని గ్లిడెన్ తెలిపింది. అంతేకాదు ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటున్న వారిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులే ఉన్నారు. బిజీ లైఫ్, అధిక ఒత్తిడి, ఆర్థిక స్థిరత్వం లేకపోవడం వంటి అంశాలు వారిని ఇతరుల వైపుకు వెళ్ళలా చేస్తున్నాయని తెలుస్తోంది. ఉద్యోగపరమైన ఒత్తిడి వల్ల తమ జీవిత భాగస్వాములు కుటుంబానికి తగినంత సమయం కేటాయించకపోవడం వల్ల మనస్పర్థలు వస్తున్నాయని కూడా చెబుతున్నారు. దీనికి తోడు వ్యక్తిగత కోరికలను తీర్చడంలో పార్టనర్స్ విఫలమవుతున్నప్పుడు వేరే వ్యక్తుల దగ్గరకు చేరువవుతున్నారని గ్లీడెన్ సంస్థ చెబుతోంది. వివాహేతర సంబంధాల కారణంగా దేశ వ్యాప్తంగా విడాకులు తీసకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. కుటుంబ కలహాలతో హత్యలు జరుగుతున్నాయని వివరించింది. ఇది భారతీయ కుటుంబ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధాల వలన తాత్కాలిక సంతోషం వచ్చినా చివరికి ఎన్నో మానసిక, సామాజిక సమస్యలకు దారి తీస్తుందని, కొందరి జీవితాలను పెను విషాదంలోకి నెడుతున్నాయని చెబుతున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంపార్టెన్స్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.    

Also Read: New Visa Rules: వెళ్ళినా, వచ్చినా కూడా ఫోటోలు..యూఎస్ కొత్త రూల్

Advertisment
తాజా కథనాలు