ఫ్రెండ్‌షిప్ అంటే అత్యాచారానికి లైసెన్స్‌ కాదు.. కోర్టు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ హైకోర్టు పోక్సో కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫ్రెండ్‌షిప్ అంటే రేప్ చేసేందుకు లైసెన్స్ కాదంటూ తేల్చిచెప్పింది. తాము స్నేహితులని చెప్పిన నిందితుడు మందుస్తు బెయిల్ కోసం అభ్యర్థించిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

New Update
Friendship no licence to rape, says Delhi High Court

Friendship no licence to rape, says Delhi High Court


ఢిల్లీ హైకోర్టు పోక్సో కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫ్రెండ్‌షిప్ అంటే రేప్ చేసేందుకు లైసెన్స్ కాదంటూ తేల్చిచెప్పింది. తాము స్నేహితులని చెప్పిన నిందితుడు మందుస్తు బెయిల్ కోసం అభ్యర్థించిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ అసలేం జరిగింతో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఈ కేసులో మైనర్ అయిన బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా ఆమెకు నిందితుడితో పరిచయం ఉంది. అయితే ఓ రోజు అతడు ఆమెను తన స్నేహితుడి ఇంటికి తీసుకొచ్చి బంధించాడు. 

Also Read: అమెరికాలో ముగ్గురి చావుకు కారణమైన భారతీయుడు.. భయంకరమైన VIDEO

ఆమెను కొట్టి లైంగికంగా వేధించాడు. అంతేకాదు ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో తాము ఇష్టపూర్వకంగా సంబంధం కొనసాగించామని ఆరోపిస్తూ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిందితుడు కోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్‌ను తిరస్కరించింది. గతంలో కూడా కోర్టు నాలుగుసార్లు ఇలాంటి అభ్యర్థనను తోసిపుచ్చింది. 

Also Read: వైట్‌హౌస్‌ కూల్చివేత.. వివాదాస్పదమైన ట్రంప్‌ నిర్ణయం

తాజాగా ఈ కేసుపై విచారించి ధర్మాసనం.. '' నిందితుడు, బాధితురాలు స్నేహితులే అయినప్పటికీ.. బాధితురాలిపై పదేపదే రేప్ చేయడం, స్నేహితుడి ఇంట్లో బంధించి కొట్టడానికి స్నేహం ఎలాంటి లైసెన్స్ ఇవ్వదని'' పేర్కొంది. నిందితుడు చేసిన వ్యాఖ్యలను తిరస్కరించింది. చివరికి నిందితుడికి బెయిల్‌ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. 

Also Read: దమ్ముంటే మమ్నల్ని ఎదుర్కో.. ఆసిం మునీర్‌కు టీటీపీ హెచ్చరిక

Advertisment
తాజా కథనాలు