Road Acccident: అమెరికాలో ముగ్గురి చావుకు కారణమైన భారతీయుడు.. భయంకరమైన VIDEO

ఇండియా నుంచి అమెరికా వెళ్లిన అక్రమ వలసదారు ఆ దేశంలో ముగ్గురు చావుకి కారణమైయ్యాడు. కాలిఫోర్నియాలోని ఒంటారియోలో 10వ ఫ్రీవేపై డ్రగ్స్ మత్తులో ట్రక్ నడిపిన 21 ఏళ్ల జషన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి భారీ రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు.

New Update
Illegal Indian Immigrant

ఇండియా నుంచి అమెరికా వెళ్లిన అక్రమ వలసదారు ఆ దేశంలో ముగ్గురు చావుకి కారణమైయ్యాడు. కాలిఫోర్నియా(south-california)లోని ఒంటారియోలో 10వ ఫ్రీవేపై డ్రగ్స్ మత్తులో ట్రక్ నడిపిన 21 ఏళ్ల జషన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి భారీ రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, యాలబ్ సిటీకి చెందిన జషన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్(Illegal Indian Immigrant) తీసుకొని మితిమీరిన వేగంతో ట్రక్‌ను నడుపుతున్నాడు. ట్రాఫిక్‌లో నెమ్మదిగా కదులుతున్న ముందున్న వాహనాలను ఢీకొట్టాడు. హై స్పీడ్‌లో వచ్చి.. బ్రేక్ వేయకుండా ముందున్న వాహనాలను ఢీకొట్టాడని కాలిఫోర్నియా హైవే పెట్రోల్ పేర్కొంది. దీంతో ఈ రోడ్డు ప్రమాదంలో కార్లు, ట్రక్కులు ఒకదానికోటి అలా ఢీకొని భారీ ట్రక్కులు, కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ భయంకరమై రోడ్డు ప్రమాదం ట్రక్‌లోని సీసీకెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read :  వైట్‌హౌస్‌ కూల్చివేత.. వివాదాస్పదమైన ట్రంప్‌ నిర్ణయం

Road Accident In America

ఈ ఘటనతో జషన్ ప్రీత్ సింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఇతను అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వలసదారుడని, మార్చి 2022లో బైడెన్ పరిపాలనలో కాలిఫోర్నియా సరిహద్దు వద్ద పట్టుబడి విడుదలయ్యాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల డ్రైవింగ్ లైసెన్సుల జారీ, వారిపై పర్యవేక్షణ గురించి తీవ్ర చర్చకు దారితీసింది.

జషన్ ప్రీత్ సింగ్‌పై డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్, హత్య వంటి అభియోగాలపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ విధ్వంసకర ప్రమాదం అమెరికాలో అక్రమ వలసదారుల భద్రతా ప్రమాణాలు, డ్రైవింగ్ సామర్థ్యాలపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం అయ్యేలా చేసింది. గతంలో ఫ్లోరిడాలోనూ భారతీయ అక్రమ ట్రక్ డ్రైవర్ హర్జిందర్ సింగ్ నిర్లక్ష్యంతో ముగ్గురు మరణించిన ఘటన తర్వాత, తాజాగా జరిగిన ఈ ప్రమాదం అమెరికాలో వలస విధానాలపై కఠిన వైఖరి అవసరమనే వాదనకు బలం చేకూర్చింది.

Also Read :  H1 బీ వీసా ప్రభావం.. కెనడా బిగ్‌ ప్లాన్

Advertisment
తాజా కథనాలు