VP Election: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. ఆ 15 మంది ఎంపీలు ఎవరు?

ఉపరాష్ట్రపతి ఎన్నికలో  సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. పార్లమెంట్‌లో మొత్తం ఓటర్లు 782 మంది ఉండగా 767 ఓట్లు పోలయ్యాయి. దీంతో 15 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. 

New Update
VP Election

VP Election

ఎన్డీయే కూటమి(NDA Alliance) తరఫున ఉపరాష్ట్రపతి ఎన్నిక(Vice President Election) లో  సీపీ రాధాకృష్ణన్  పోటీ చేసి విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా,  జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. అయితే పార్లమెంట్‌లో మొత్తం ఓటర్లు 782 మంది ఉన్నారు. కానీ 767 ఓట్లు పోలయ్యాయి. దీంతో 15 ఓట్లు లెక్కలోకి రాలేదు. అయితే 15 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. 

Also Read :  Ravi Prakash : నేపాల్ లాంటి తిరుగుబాటు మనకూ తప్పదు.. రవిప్రకాష్‌ ట్వీట్ వైరల్!

క్రాష్ ఓటింగ్‌కు పాల్పడిన ఎంపీలు..

ఎందుకంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌(CP Radhakrishnan) కు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఓట్లు పొందారు. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థికి మద్దతుదారుల నుంచి పూర్తి స్థాయిలో అయితే ఓట్లు రాలేదు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మొత్తం 452 ఓట్లు వచ్చాయి. ఇది ఎన్డీఏ ఎంపీల మొత్తం సామర్థ్యం కంటే ఎక్కువ. జస్టిస్ సుదర్శన్‌కు ఇండియా కూటమి నుంచి రావాల్సిన ఓట్లు రాలేదని తెలుస్తోంది. అయితే తమిళనాడు డీఎంకే ఎంపీలు క్రాష్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చి ఎన్డీఏకు ఓటర్లు వేసినట్లు తాజా ఫలితాల్లో తెలుస్తోంది. 

Also Read :  రాధాకృష్ణన్‌కు మోదీ, చంద్రబాబుతో సహా ప్రముఖుల విషెస్.. ఎవరు ఏమన్నారంటే?

Advertisment
తాజా కథనాలు