Ravi Prakash : నేపాల్ లాంటి తిరుగుబాటు మనకూ తప్పదు.. రవిప్రకాష్‌ ట్వీట్ వైరల్!

మొన్న శ్రీలంక.. నిన్న బంగ్లాదేశ్.. నేడు నేపాల్..  పాలకులను ప్రజలు తరమికొట్టారు. మాములుగా కాదు.. తరిమి తరిమి కొట్టారు. అధ్యక్ష భవనాలనే ముట్టడించి తగలబెట్టారు. ఏ సాయుధ బలగాలు కూడా వారిని ఆపలేకపోయాయి.

New Update
ravi

మొన్న శ్రీలంక.. నిన్న బంగ్లాదేశ్.. నేడు నేపాల్..  పాలకులను ప్రజలు తరమికొట్టారు. మాములుగా కాదు.. తరిమి తరిమి కొట్టారు. అధ్యక్ష భవనాలనే ముట్టడించి తగలబెట్టారు. ఏ సాయుధ బలగాలు కూడా వారిని ఆపలేకపోయాయి. కట్టలు తెచ్చుకున్న వారి అగ్రహాన్ని అణిచివేలేకపోయాయి. ఇన్ని రోజులు తమను తాము రాజులుగా భావించిన ఈ పాలకులను దేశం దాటి పారిపోయేలా చేశారు ప్రజలు. ఇన్ని రోజులు తమ దేశంలో ప్రజల సొమ్ముతో దర్జాగా బతికిన ఈ పాలకులు చివరకు విదేశాల్లో తమ ఆచూకీ ఎవరికీ  తెలియకుండా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితి వచ్చింది. వీటికి కారణం ఒకే ఒక్కటే.. అదే అవినీతి.

శ్రీలంకలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్న రాజపక్స కుటుంబం అవినీతి, దుర్వినిత పాలనపై ప్రజల్లో పేరుకుపోయిన కోపం ఈ నిరసనలకు దారితీసింది. రాజపక్స కుటుంబం దేశంలోని ముఖ్యమైన పదవులను తమలో తామే పంచుకోవడం, పెద్దఎత్తున అవినీతికి పాల్పడడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ప్రభుత్వ కాంట్రాక్టులలో, రుణాలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రజల ఆందోళనలు వీధులకు చేరి హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికారిక నివాసాన్ని ముట్టడించారు. ఆ సమయంలో అధ్యక్షుడు భవనం నుంచి పారిపోయి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.

బంగ్లాదేశ్ లో కూడా ఇంతే

బంగ్లాదేశ్ లో కూడా ఇంతే. అవినీతికి వ్యతిరేకంగానే కాకుండా, ప్రభుత్వ నిరంకుశ పాలన, నిరుద్యోగం వంటి అనేక సమస్యలపై కూడా అక్కడి ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. షేక్ హసీనా ప్రభుత్వం తన పాలనలో నిరంకుశంగా వ్యవహరిస్తుందని, ప్రతిపక్షాలను అణచివేస్తుందని, పత్రికా స్వేచ్ఛను అరికట్టే ప్రయత్నాలు చేసిందని తీవ్ర అవినీతికి పాల్పడిందనే  ఆరోపణలు ఉన్నాయి. దీంతో అధికార పార్టీ కార్యాలయాలపై, నాయకుల ఇళ్లపై ప్రజలు తిరగబడి మరీ దాడులు చేశారు.  ఇక నేపాల్‌లో కూడా అవినీతే. అక్కడి ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై వీడియోలను యువత సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించడం  ప్రజల తిరుగుబాటుకు దారి తీసింది. నిరసనకారులు పార్లమెంట్ భవనం, ప్రధాని కేపీ శర్మ ఓలీ నివాసం, ఇతర మంత్రుల ఇళ్లను ధ్వంసం చేసి నిప్పంటించారు.  ఈ మూడు దేశాల్లోనూ  ఆర్థిక సంక్షోభం, తీవ్రమైన అవినీతి, నిరంకుశ పాలన ప్రజలు తిరగబడటానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. 

ఎప్పటికైనా ప్రజలు తిరగబడక తప్పదు

ఈ క్రమంలో రవిప్రకాష్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. గతంలో ఓ మహిళా నేత మాట్లాడిన ఓ వీడియోను ఆయన షేర్ చేశారు. దేశాన్ని నడపండని మనం రాజకీయ నాయకుల్లో అధికారాన్ని పెడితే వాళ్లు తమ ఆస్తులను పెంచుకుని మన అప్పులు పెంచడమే చేస్తున్నారని మహిళా నేత ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.  రాజకీయ నాయకులు తమ పని తాము చేయక, దోచుకోవడం, పంచుకోవడం, దేశాన్ని అప్పులు చేయడం లాంటివి చేస్తే ఎప్పటికైనా ప్రజలు తిరగబడక తప్పదు అనడానికి ఈ మూడు దేశాలు మంచి ఉదాహరణ అని ఆ వీడియోకు తన అభిప్రాయాన్ని జత చేశారు రవి ప్రకాష్.  మన దేశంలోనూ అవినీతి ఇలాగే పెరిగిపోతూ ఉంటే ఇలాంటి పరిస్థితి కూడా ఇక్కడ తలెత్తే ప్రమాదం ఉందని.. పొలిటికల్ లీడర్స్ ను రవిప్రకాష్ తన పోస్ట్ లో హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు