Pataiya Baba: వయసు 106 ఏళ్లు.. కేవలం వేపాకులు తింటూ జీవిస్తున్న బాబా

బిహార్‌లోని పతైయా బాబా అనే వ్యక్తి 106 ఏళ్ల వయసులోనూ కర్ర సాయం లేకుండానే నడుస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు పరిగెడుతూ కూడా అందరినీ ఆశ్చర్యపరుతున్నాడు.

New Update
Pataiya Baba

Pataiya Baba

ప్రస్తుత రోజుల్లో 70 ఏళ్లు బతకడమే కష్టంగా మారిపోయింది. 40 ఏళ్లు దాటాకే చాలామంది అనేక రోగాల బారీన పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై చనిపోతున్నారు. అయితే ఓ బాబా మాత్రం 106 ఏళ్ల వయసులోనూ కర్ర సాయం లేకుండానే నడుస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు పరిగెడుతూ కూడా అందరినీ ఆశ్చర్యపరుతున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే బిహార్‌లోని ఛప్రాలో పతైయా బాబా అనే వ్యక్తి ఉంటున్నాడు. ఈయన వయసు 106 ఏళ్లు. 

Also Read: పాక్ కు ఇక మూడినట్టే..భారత అగ్ని-5 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష సక్సెస్

అయిప్పటికీ కర్ర సాయం లేకుండా నడవడం, అప్పడుప్పుడు పరిగెత్తడం ఈయన ప్రత్యేకత. తాను ఒకప్పుడు చిత్రకూట్‌లోని 2 లక్షల చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్న దట్టమైన అడవిలో 32 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసినట్లు చెప్పారు. ఆ సమయంలో భారత్‌ ఇంకా బ్రిటిష్‌ పాలనలోనే ఉంది. ఆయన తపస్సు చేసుకుంటూ కేవలం వేపాకులు, గడ్డి మాత్రమే తిని జీవించానని తెలిపారు. అప్పట్లో తనతో పాటు దేవరహవా బాబా, త్రిదండి స్వామి, ముఖ్రామ్ బాబా, ఖపడియా బాబా లాంటి చాలామంది సాధువులు తపస్సు చేసినట్లు చెప్పారు. ఆ సమయంలో కఠోర తపస్సు చేయడం వల్ల ఆత్మశక్తి, దైవ దర్శనం వచ్చేవని బాబా పేర్కొన్నారు. 

Also Read: ఎవరు నచ్చకపోతే వాళ్ళను పంపేయొచ్చు..సీఎం, పీఎం 30 రోజుల జైలు బిల్లుపై రాహుల్ విమర్శ

 పతైయా బాబా చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటిదాకా ఆయన వెయ్యికి పైగా యజ్ఞాలు చేశారు. భారత్‌లోని అనేక ప్రాంతాల్లో గడిపారు. చాలావరకు దేవాలయాల నిర్మాణానికి సహకారం అందించారు. భారత్‌కు స్వాతంత్ర్యం రాకముందు పాకిస్థాన్‌లోని కరాచీ, ఇతర నగరాల్లోని దేవాలయాల్లో సేవలందిచారు. భారత్‌లోనే కూడా విదేశాల్లో కూడా ఆయన కాలినడకతోనే నడిచేవారు. ప్రతిరోజూ యోగా చేసేవారు, నడిచేవారు. ఈ పర్యటనలు ఆయన ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. శారీరకంగా ధృడంగా అయ్యేలా చేశాయి .  

Also Read: హీటెక్కుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక.. NDAకి గట్టి పోటీ ఇవ్వనున్న ఇండియా కూటమి

ఆ బాబా 106 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రతిరోజూ ఆయన ఉదయం దేవుడిని పూజిస్తారు. అనంతరం యోగా చేసి, నడుస్తారు. పండ్లు, తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఇవి పాటించడం వల్లే తాను ఎక్కువకాలం బతికి ఉన్నట్లు బాబా చెబుతున్నారు. ఎక్కువ ఆహారం తీసుకోవడం మానేయాలని ఆ బాబా సలహాలిస్తున్నారు. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలు చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. పతైయా బాబా జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలస్తోంది. ఆయన తపస్సు, సేవలతో వినూత్న జీవన శైలిని ఎంచుకున్నారు. ప్రస్తుతం ఆ బాబా గురించి చర్చనీయాంశమవుతోంది. చాలామంది ఆయన్ని చూసేందుకు కూడా వస్తున్నారు. అనేక విషయాలు అడిగితెలుసుకుంటున్నారు .  

Also Read: చేతులు దులిపేసుకుంటే ఎలా? అందరూ బాధ్యులే.. విద్యుత్‌ మృతులపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు