Agni-5 Ballistic Missile: పాక్ కు ఇక మూడినట్టే..భారత అగ్ని-5 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష సక్సెస్

పహల్గాం దాడి, పాక్ తో ఘర్షణ తర్వాత భారత్ తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో నిన్న అగ్ని-5 బాలిస్టిక్ మిస్సైల్ ను టెస్ట్ చేసింది. ఇది సక్సెస్ అయిందని...5 వేల కిలోమీటర్ల రేంజ్ లో శత్రువులను ఛేదించగలదని తెలుస్తోంది. 

New Update
agni-5

Agni-5 Ballistic Missile

భారత్ తన రక్షణ వ్యవస్థపై పూర్తిగా పెట్టింది. ఈ క్రమంలో వరుసపెట్టి మిస్సైల్స్, ఫైటర్ జెట్స్ లాంటి వాటిని పరీక్షిస్తుంది. తాజాగా అగ్ని-5 బాలిస్టిక్ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించింది. బుధవారం ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి అగ్ని-5ని పరీక్షించినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. అగ్ని-5 బాలిస్టిక్ మిస్సైల్ అన్ని లక్ష్యాలను ఛేదించిందని చెబుతున్నారు. ఇది 5వేల కిలో మీటర్ల రేంజ్ లో శత్రు వ్యవస్థను నాశనం చేయగలదని వివరించారు. అగ్ని-5 క్షిపణి వ్యవస్థల సంసిద్ధత కోసం జరిపిన సాధారణ పరీక్ష ఇది అని రక్షణ అధికారులు తెలిపారు. ఇదిగాక 7500 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలిగే మరో బాలిస్టిక్ మిస్సైల్ ను కూడా తయారు చేస్తున్నామని చెబుతున్నారు. 

శత్రువుకు మూడినట్టే...

ఈ బాలిస్టిక్ మిస్సైల్స్ అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అగ్ని-5 క్షిపణికి ఒకేసారి అనేక అణ్వాయుధాలను మోసుకెళ్లి వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించే సామర్థ్యం ఉంది. 2024 మార్చి 11వ తేదీన తమిళనాడులోని కల్పక్కం నుంచి అగ్ని-5 ఎంఐఆర్‌వీ పరీక్షను మొదటిసారి నిర్వహించారు. రానున్న రోజుల్ దీనిని మరింత అప్ గ్రేడ్ చేయనున్నామని డీఆర్డీవో చెబుతోంది. ఈ అగ్ని-5 క్షిపణికి బంకర్-బస్టర్ బాంబ్ టెక్నాలజీని జోడించి.. అవతలి వారిది ఎంత బలమైన లక్ష్యమైనా ఛేదించగలిగేలా తయారు చేయాలని డీఆర్డీవో ఆలోచిస్తోంది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ఈ అగ్ని-5 బాలిస్టిక్ మిస్సైల్.. మల్టీపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌ టెక్నాలజీతో రూపొందించినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ ఒక్క క్షిపణి సాయంతో ఒకేసారి వేర్వేరు లక్ష్యాలను ఛేదించవచ్చును. అంతకు ముందు రెండు నెలల క్రితం జూలైలో స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్ ను కూడా డీఆర్డీవో పరీక్షించింది.

Also Read:  Alaska Meet: ఎక్కడైనా ఫ్రెండే కానీ ఆంక్షల దగ్గర కాదు..రష్యా విమానాలకు ఇంధనం ఇవ్వని అమెరికా

Advertisment
తాజా కథనాలు