Smile: రోజుకు పావుగంట నవ్వితే ఈ అద్భుత ప్రయోజనాలు

నవ్వడం వల్ల శరీరంలో స్ట్రెస్ హార్మోన్‌లు తగ్గుతాయి. నవ్వు ఒత్తిడిని తగ్గి మనసు హాయిగా ఉచుతోంది. అంతేకాకుండా టైప్ 2 డయాబెటిస్‌, గుండె జబ్బుల అవకాశాలను తగ్గిస్తుంది. నవ్వే సమయంలో ముఖంలోని కండరాలు కదిలి చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా మెరిసిపోతుంది.

New Update

Smile: నవ్వడం అనేది మన ఆరోగ్యాన్ని మెరుగుపరచే అతి సులభమైన మార్గాల్లో ఒకటి. రోజంతా ఎన్నో ఒత్తిళ్లతో సతమతమవుతున్న ప్రస్తుత కాలంలో నవ్వడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. రోజుకు కనీసం 15 నిమిషాల పాటు నవ్వడం వల్ల శరీరానికి రెండు గంటల నిద్ర ఇచ్చినంత ప్రయోజనం కలుగుతుంది. నవ్వడం వల్ల శరీరంలోని స్ట్రెస్ హార్మోన్‌లు తగ్గుతాయి. ఒత్తిడిని తగ్గించడంలో ఇది సహజసిద్ధమైన ఔషధంలా పని చేస్తుంది. దీని వల్ల మనసు హాయిగా మారుతుంది. 

శరీరంలోని ఎండార్ఫిన్స్ విడుదలై..

ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌కి కారణమయ్యే మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. నవ్వుతో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది గుండె జబ్బుల అవకాశాలను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో యాంటీ బాడీలు పెరిగి రోగనిరోధక శక్తి బలపడుతుంది. దీనివల్ల చిన్నపాటి జ్వరం నుంచి తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యల వరకు ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. నవ్వే సమయంలో ముఖంలోని కండరాలు కదిలి రక్తప్రసరణ మెరుగవ్వడంతో చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా మెరిసిపోతుంది. ఇదే కాకుండా నవ్వడం వల్ల శరీరంలోని ఎండార్ఫిన్స్ విడుదలై నొప్పిని తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: గుండెపోటుకు అరటిపండుతో చెక్‌..రోజుకు 3 తినండి

ముఖ్యంగా మైగ్రేన్‌, నరాల నొప్పులకు ఇది సహజ పరిష్కారంగా పనిచేస్తుంది. నవ్వే సమయంలో ఛాతి, జీర్ణాశయ భాగాలు కదిలి వ్యాయామం జరిగేలా అవుతాయి. దీని వల్ల ఆ భాగాలు మరింత ఆరోగ్యంగా ఉంటాయి. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు నవ్వడం ద్వారా మెదడులో రిలాక్సింగ్ కెమికల్స్ విడుదల కావడంతో నిద్ర మెరుగవుతుంది. అలసటగా ఉన్నప్పుడు కొద్ది నిమిషాలు నవ్వితే శరీర శక్తి స్థాయి తిరిగి పెరుగుతుంది. ఈ ప్రయోజనాలన్నింటినీ పొందాలంటే హాస్య కథలు చదవడం, కామెడీ వీడియోలు చూడడం, స్నేహితులతో సరదా చర్చలు జరపడం ద్వారా రోజుకు కనీసం 15 నిమిషాలైనా నవ్వే అలవాటు చేసుకోవాలి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: కూరల్లో ఇంగువ వాడుతున్నారా.. దాని లాభాలు తెలుసా?

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment