నా డబ్బు నాఇష్టం, నీకేంటి నొప్పి-మంచు లక్ష్మి

మంచు లక్ష్మి...ఈమె సూపర్ ఫేమస్. మోహన్ బాబు కూతురిగానే కాదు...యాక్టర్ గా కూడా చాలా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ లో లక్ష్మి ఓ సెలబ్రిటీ. తరుచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యే ఆమె ఈరోజు ఓ వీడియో రిలీజ్ చేశారు. రీసెంట్ గా తాను చేసిన ట్వీట్ మీద వచ్చిన విమర్శలకు ఘాటుగా రిప్లై ఇచ్చారు.

New Update
నా డబ్బు నాఇష్టం, నీకేంటి నొప్పి-మంచు లక్ష్మి

నేను మంచిగా సంపాదించుకుంటున్నాను...ఖర్చుపెట్టుకుంటాను. మధ్యలో మీకేంటి నొప్పి అంటూ చెప్పుతో కొట్టినట్టు గా ఓ నెటిజన్ కు సమాధానం ఇచ్చారు మంచు లక్ష్మి. రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో కార్పెట్స్ శుభ్రంగా లేవు. బిజినెస్ క్లాస్ కి వెళ్లే కార్పెట్స్ ఇంత దారుణమా. నా ఐ ఫోన్ ఆ కార్పెంట్స్ ని కొంచెం బెటర్ గా చూపించాయి. చెప్పాలంటే అవి ఇంకా అపరిశుభ్రంగా ఉన్నాయి. శుభ్రత మన హక్కు... అని మంచు అక్కాయ్ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో చాలా ట్రోలింగ్ అయింది. తెగ కామెంట్లు రాసారు నెటిజన్లు. అందులో ఒకరు నువ్వు బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నావ్, ఐఫోన్ వాడుతున్నావ్ అని మాకు తెలియాలా? అతి చేయకు. నీకు డబ్బులు ఉన్నాయి. ఎలాగైనా ఎంజాయ్ చేస్తావ్... అంటూ కామెంట్ చేశారు. దీనికి మన లక్ష్మి అక్కకు బాగా కాలింది. దాంతో మళ్ళీ ఇంకో వీడియో పోస్ట్ చేసింది. అందులో సదరు నెటిజన్ ను శుభ్రంగా కడిగి పారేసింది.

ఓ నువ్వు బిజినెస్ క్లాస్‌లో వెళ్తున్నావేమో, ఓహ్ నీకు ఐఫోన్ ఉందేమో అని కామెంట్లు పెడుతున్నారు. నువ్వు కొనిచ్చావా నాకు? నా కష్టం, నా సంపాదన, నా ఖర్చు.. నీకేంట్రా నొప్పి. నువ్వేదో నాకు డబ్బులిస్తున్నట్టు ఫీల్ ఎందుకు అయిపోతున్నారు అంటూ అడిగింది మంచు లక్ష్మి. నేనొక ఐఫోన్ వాడడం, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడం తప్పన్నట్టు చూపిస్తున్నారు. నాకు సొంత ప్రైవేట్ విమానం కావాలి. ఏ నీకు వద్దా? నువ్వు పెద్ద కోరికలు కోరుకోవా? కలలు కనవా?’ అంటూ ఫైర్ అయ్యారు. నాకు డబ్బులు అమ్మానాన్న ఎవరూ ఇవ్వడం లేదు. చిన్నప్పటి నుండి అలానే పెంచారు. నేను ఎంజాయ్ చేసే ప్రతి రూపాయి నాదే. నేను ధనిక కుటుంబంలో పుట్టాను. అలాంటి నేను అమెరికాలో తిండికి కూడా ఇబ్బందిపడ్డాను. డబ్బు సంతోషం ఇవ్వదు. కేవలం ఫ్రీడమ్ ఇస్తుంది. నేను కూడా ఇల్లు, పిల్లల్ని చూసుకుంటూ, గిన్నెలు తోముకుంటూ బ్రతకాలా?. ఆడవాళ్లు ఏం చేసినా తప్పేనా? మాకంటూ కెరీర్ ఉండకూడదా?. ఆడవాళ్లు ఈ పనులు చేయడం తప్పు కాదు. ఎవరి కెరీర్లో వాళ్ళు ఎదుగితే తప్పేంటి. జీవితం చాలా చిన్నది. చిటికెలో ముగుస్తుంది. ఒకరి కోసం బ్రతకకు. నీకు ఇష్టం వచ్చినట్లు జీవించు... అంటూ వీడియో షేర్ చేసింది.

Advertisment
తాజా కథనాలు