Mahesh Babu: గుంటూరు కారం.. లిరికల్ వీడియో రెడీ అవుతోంది

మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోంది గుంటూరుకారం సినిమా. ఏ ముహూర్తాన ఈ సినిమాను మొదలుపెట్టారో కానీ, ప్రారంభం నుంచి ఓ రకమైన అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాపై షూటింగ్ అప్ డేట్స్ కంటే, పుకార్లే ఎక్కువగా వచ్చాయి. దీనికితోడు హీరోయిన్ మార్పులు, ఫైట్ మాస్టర్ మార్పులు లాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. వాటికంటే ముందు, ఏకంగా కథనే మార్చేసిన సంగతి చాలాకొద్ది మందికి మాత్రమే తెలిసిన నిజం.

New Update
Mahesh Babu: గుంటూరు కారం.. లిరికల్ వీడియో రెడీ అవుతోంది

Mahesh Babu Guntur Kaaram : ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్‌పై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ సినిమా కోసం చకచకా 4 సాంగ్స్ రెడీ చేశాడట తమన్. త్రివిక్రమ్ (Trivikram) పక్కనుంటే తన పని శరవేగంగా సాగుతుందని ఇప్పటికే పలుమార్లు చెప్పిన తమన్ (SS Thaman), అన్నట్టుగానే ట్యూన్స్ రెడీ చేశాడట.

అయితే ఈ సాంగ్స్ అన్నింటికీ రెడ్ సిగ్నల్ పడింది. ఒక్కటంటే, ఒక్క పాటకు కూడా ఆమోద ముద్ర వేయలేదంట మహేష్ బాబు. అలా కొన్నాళ్లుగా సాంగ్స్‌పై ప్రచారం నడుస్తోంది. తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజుకు కూడా లిరికల్ వీడియో రిలీజ్ చేయడానికి ప్రయత్నించారని, కానీ మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదంటూ ప్రచారం జరిగింది.

ఎట్టకేలకు గుంటూరు కారం (Guntur Kaaram) లిరికల్ వీడియో వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా తమన్ కంపోజ్ చేసిన ఓ ట్యూన్‌ను మహేష్ (Mahesh Babu) ఓకే చేశాడు. వెంటనే ఆ ట్యూన్‌పై సాంగ్ పాడించారు. ఇప్పుడు ఆ పాటకు లిరికల్ వీడియో తయారుచేసే పని మొదలుపెట్టారు. లిరికల్ వీడియో వర్క్ పూర్తయిన వెంటనే, రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మెయిన్ హీరోయిన్‌గా ఉన్న పూజాహెగ్డే తప్పుకుంది. అప్పటివరకు సెకెండ్ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీల (Sree Leela) ను మెయిన్ లీడ్‌గా మార్చేశారు. ఇక సెకెండ్ హీరోయిన్ కోసం మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. ఇక ఈ సినిమా నుంచి రామ్-లక్ష్మణ్ కూడా సైడ్ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఇక తమన్‌ను తొలిగించారనే రూమర్లు చాన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. వీటిలో పూజాహెగ్డే తప్పుకున్న మేటర్ ఒక్కటే వాస్తవం. మిగతావన్నీ అవాస్తవాలని అంటోంది యూనిట్.

తన పుట్టినరోజు కోసం విదేశాలకు వెళ్లాడు మహేష్ బాబు. కుటుంబంతో కలిసి దాదాపు 3 వారాల పాటు పలు దేశాలు పర్యటించాడు. స్కాట్లాండ్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. అలా గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేట్ చేసుకొని, రీసెంట్‌గా హైదరాబాద్ వచ్చాడు. మహేష్ రాకతో గుంటూరు కారం షూటింగ్‌లో మళ్లీ చలనం వచ్చింది. 16వ తేదీ నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఈ మేరకు హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో వేసిన భారీ ఇంటి సెట్‌కు చిన్నచిన్న మార్పులు చేస్తున్నారు.

Also Read: దుమ్ము దులుపుతున్న రజనీకాంత్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు