/rtv/media/media_files/2025/05/05/myx1ru4tnF9G6rgqi3FY.jpg)
Zero Shadow
సాధారణంగా పగటి సమయంలో సూర్య కాంతి పడితే.. పక్కన నీడ కనిపిస్తుంది. రోజులో ఏ సమయంలో ఎండ పడినా కూడా నీడ తప్పనిసరిగా కనిపిస్తుంది. కానీ నేటి నుంచి 14వ తేదీ వరకు ఏపీలో మిట్ట మధ్యాహ్నం కూడా రెండు నిమిషాలు పాటు నీడ మాయమైపోతుంది. దీన్నే జీరో షాడో అంటారు. మధ్యాహ్న సమయంలో ఒక రెండు నిమిషాల పాటు నీడ మాయం కానుందని ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సర్చ్ క్యాంపెయిన్ జాతీయ కన్వీనర్ మేకా సుసత్య రేఖ తెలిపారు.
ఇది కూడా చూడండి:Trump effect on Tollywood: తెలుగు సినిమాకు ట్రంప్ దెబ్బ.. 7 వేలు దాటనున్న టికెట్ ధరలు!
నేటి నుంచి మిట్ట మధ్యాహ్నం నీడ మాయం
— Dopamine24 (@SmartLi72142494) May 5, 2025
ఖగోళ అద్భుతం వల్ల సోమవారం నుంచి ఈ నెల 14వరకు మిట్ట మధ్యాహ్నం మనిషి నీడ రెండు నిమిషాల పాటు మాయమవుతుందని ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సర్చ్ క్యాంపెయిన్ (ఐఏఎస్సీ) జాతీయ కన్వీనర్ మేకా సుసత్యరేఖ ఆదివారం తెలిపారు.@DrKSVarma#zeroshadowpic.twitter.com/UrWd1SD3JC
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్‌లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్
ప్రతీ ఏడాది ఈ జీరో షాడో..
మనుషులపై సూర్య కిరణాలు లంబంగా పడటం వల్ల ఒక రెండు నిమిషాల పాటు నీడ మాయం అవుతుంది. భూమి అక్షం 23.5 డిగ్రీలు వంపుగా ఉండటం వల్ల సూర్యుడి చుట్టూ భూమి తిరిగే సమయంలో సూర్యుడి స్థానంలో ఉత్తర, దక్షిణ దిశల్లో మారుతుంటుంది. ఈ సమయంలో కర్కాటక, మకర రేఖల మధ్యనున్న ప్రదేశాల్లో సూర్య కిరణాలు భూమిపై సంపూర్ణ లంబంగా పడతాయి. ఈ క్రమంలో నీడ కనిపించదు. అయితే ప్రతే ఏడాది ఇది జరుగుతుంటుంది.
ఇది కూడా చూడండి:Indo-Pak tension: పాకిస్థాన్‌పై దాడి లాంఛనమే.. IAF చీఫ్‌తో ప్రధాని మోదీ
https://t.co/TqWNTGNPT2
— Tone News (Teluguone) (@teluguonenews) May 5, 2025
నేటి నుంచి పది రోజులు జీరో షాడో.. అంటే ఏమిటో తెలుసా?#zeroshadow#TENDAYS#may5th#may10th