Hyderabad: ఈరోజు జీరో షాడో డే.. ఎప్పుడంటే
హైదరాబాద్లో ఈరోజు జీరో షాడో డే జరగనుంది. మధ్యాహ్నం 12:12 PM గంటలకు ప్రారంభమై.. రెండు, మూడు నిమిషాల వరకు కొనసాగుతుందని హైదరాబాద్లోని బి.ఎం.బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు బుధవారం తెలిపారు.
హైదరాబాద్లో ఈరోజు జీరో షాడో డే జరగనుంది. మధ్యాహ్నం 12:12 PM గంటలకు ప్రారంభమై.. రెండు, మూడు నిమిషాల వరకు కొనసాగుతుందని హైదరాబాద్లోని బి.ఎం.బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు బుధవారం తెలిపారు.
ప్రతీ ఏడాది ఒకరోజు అద్భుతం జరుగుతుంది. సూర్యుడు అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు ఏ వస్తువు లేదా మానవుని తాలూకా నీడా కనబడదు. ఇలా కేవలం ఏడాదిలో ఒక రోజు మాత్రమే జరుగుతుంది. మూములుగా అయితే మిగతా అన్ని రోజుల్లో సూర్యుడు ఏ పొజిషన్లో ఉన్నా కూడా నీడ ఉంటుంది.
భాగ్యనగర వాసులను మరోసారి 'జీరో షాడో డే' కనువిందు చేయనుంది. రేపు మధ్యాహ్నం 12:23 గంటల నిమిషాలకు మరోసారి నీడ కనపడదు. ఈ ఏడాది మే9న కూడా ఇలానే జరిగింది. ఏడాదికి రెండు సార్లు ఇలా జరుగుతుంది. సూర్యుడు నేరుగా భూ మధ్యరేఖకు ఎగువన అలైన్మెంట్లో ఉంటాడు. అందుకే నీడ కనపడదు.