/rtv/media/media_files/2025/04/23/1BO5q1Nhr4FvK15FeEtE.jpg)
Bathing Mistakes
Bathing Mistakes: మహిళలు స్నానం చేసేటప్పుడు తరచుగా కొన్ని సాధారణ తప్పులు చేస్తారు. దీనివల్ల వారి చర్మం దెబ్బతినడమే కాకుండా వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. చర్మాన్ని, ఆరోగ్యం మంచిగా ఉండాలంటే చిన్న తప్పులు చేయకుండా ఉండాలని అంటున్నారు. చర్మం దెబ్బతినకుండా కాపాడుకోవడానికి స్నానం చేసేటప్పుడు ఏ తప్పులు చేయకూడదో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
చర్మాన్ని కాపాడుకోవచ్చు:
అధిక వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంపై సహజ తేమ తొలగిపోతుంది. దీనివల్ల చర్మం దురద, పొడి బారుతుంది. దీంతో పాటు చర్మంపై అకాల ముడతలు కనిపిస్తాయని చెబుతున్నారు. అందుకని ఎక్కువ వేడి నీటితో స్నానం చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. అధికంగా సబ్బు వాడటం వల్ల చర్మంలో ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. దీంతో చర్మం పొడిబారి, సున్నితంగా మారుతుంది. కాబట్టి ఎక్కువ సబ్బు వాడొద్దని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా చర్మాన్ని చాలా వరకు కాపాడుకోవచ్చు. కొంతమంది మహిళలు రోజూ జుట్టుకు షాంపూ రాసుకుంటారు. ఇలా షాంపూను అధికంగా వినియోగించినా జుట్టు పొడిగా మారుతుంది. అదే సమయంలో.. జుట్టు సహజ మెరుపు కూడా తగ్గుతుంది. జుట్టును వారానికి 2, 3 సార్లు మాత్రమే కడగాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మెడపై వార్ట్స్‌ని ఇలా సులభంగా తొలగించుకోండి
తడి జుట్టు చాలా బలహీనంగా ఉంటుంది. దీంతో జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వితే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తడి జుట్టును ఎప్పుడూ దువ్వొద్దు. దీనివల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. మురికి, తడి టవల్ వాడటం వల్ల శరీరం బ్యాక్టీరియా బారిన పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే అలాంటి టవల్స్ లో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది చర్మంపై ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేస్తుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. శరీరంలోని ప్రైవేట్ పార్ట్స్ వద్ద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో సరిగా శుభ్రం చేసుకోకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఇలా చేశారంటే పాత కుళాయిలు కొత్తవాటిలా మెరుస్తాయి
( bathing tips | women's bathing | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )